Vinayaka Chavithi: బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా ఆంధ్రా స్పెషల్ పాల తాళికలు.. రెసిపీ మీ కోసం..

వినాయక చవితి రోజున బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు, పాల తాలికలు వంటి ఆహార పదార్ధాలను ఆంధ్రులు సమర్పిస్తారు. ఈ నేపధ్యంలో ఈ రోజు బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా సంపరించేందుకు పాల తాళికల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. పాల తాళికలు ఆంధ్రుల సాంప్రదాయ డెజర్ట్, ముఖ్యంగా వినాయక చవితి పండగ సమయంలో తయారు చేస్తారు. బియ్యం పిండి, పాలతో తయారు చేసే రుచికరమైన పాల తాళికల రెసిపీ మీ కోసం

Vinayaka Chavithi: బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా ఆంధ్రా స్పెషల్ పాల తాళికలు.. రెసిపీ మీ కోసం..
Vinakya Chaviti 2024
Follow us

|

Updated on: Sep 02, 2024 | 7:04 PM

భాద్రప్రద మాసంలో అడుగు పెట్టేశాం.. దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. ఓ వైపు మార్కెట్ లో అందమైన వినాయక వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. మరోవైపు మండపాలు కొలువుదీరుతున్నాయి. ఈ నేపధ్యంలో బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా సమర్పించేందుకు రకరకాల వంటకాలు తెరమీదకు వచ్చాయి. ఇక వినాయక చవితి రోజున బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు, పాల తాలికలు వంటి ఆహార పదార్ధాలను ఆంధ్రులు సమర్పిస్తారు. ఈ నేపధ్యంలో ఈ రోజు బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా సంపరించేందుకు పాల తాళికల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

పాల తాళికలు ఆంధ్రుల సాంప్రదాయ డెజర్ట్, ముఖ్యంగా వినాయక చవితి పండగ సమయంలో తయారు చేస్తారు. బియ్యం పిండి, పాలతో తయారు చేసే రుచికరమైన పాల తాళికల రెసిపీ మీ కోసం

పాల తాళికల తయారీకి కావాల్సిన పదార్ధాలు:

ఇవి కూడా చదవండి

బియ్యం పిండి: 1 కప్పు

నీరు: 1 ½ కప్పు

పాలు: 4 కప్పులు

బెల్లం తురుము: 1 కప్పు (లేదా చక్కెర)

యాలకుల పొడి: ½ టీస్పూన్

నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు

జీడిపప్పు: 10-12

ఎండుద్రాక్ష: 10-12

బాదం – 12

ఉప్పు: చిటికెడు

తయారీ విధానం: ముందుగా పాల తాళికలు కోసం పిండిని రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద దళసరి గిన్నె పెట్టి కప్పున్నర నీటిని వేసి.. అందులో చిటికెడు ఉప్పువేసి బాగా మరగించండి. ఇప్పుడు ఆ వేడి నీటిలో బియ్యం పిండి వేస్తూ ముద్దలు పట్టకుండా కలుపుతూ బియ్యం పిండిని జోడించండి. అలా బియ్యం పిండిలోని నీరు ఇంకే వరకూ తక్కువ మంట మీద ఉడికించండి. అందులో రెండు స్పూన్ల నెయ్యి.. కొంచెం పంచదార వేసి బియ్యం పిండి బాగా కలపండి. ఇప్పుడు బియ్యం పిండి కొంచెం చల్లారబెట్టి.. ఒక ప్లేట్ బియ్యం పిండిని వేసి మొత్తగా చేయాలి. ఇప్పుడు ఆ బియ్యం పిండిని సన్నగా పొడవుగా రోల్ చేయండి. పిండి పూర్తిగా ఇలా సన్నగా పొడవుగా చుట్టేయండి.

ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో పాలు వేసి బాగా పాలను మరిగించండి. అందులో తాళికలు వేసి.. వేడిని తగ్గించి.. పాల తాలికలు మెత్తగా అయ్యే వరకు ఒక 20 నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత అందులో బెల్లం తురుము లేదా పంచదార వేసి మెల్లగా కరిగే వరకూ కదిలించండి. అయితే తాళికలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలపండి. తర్వాత కొంత సేపు ఉడికించి తర్వాత యాలకుల పొడిని జోడించండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయండి. ఇప్పుడు అందులో బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించండి. ఇప్పుడు నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ ని పాల తాళికల్లో జోడించండి. అంతే బొజ్జ గణపయ్య నైవేద్యానికి పాల తాళికలు రెడీ.. పూజలో సమర్పించి.. తర్వాత ప్రసాదంగా కుటుంబంతో స్నేహితులతో కలిసి తినండి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..