- Telugu News Photo Gallery Homemade Coconut Oil: How to make coconut oil at home for beautiful skin and ha
Coconut Oil Making: ఇంట్లోనే స్వచ్ఛమైన కల్తీలేని కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు! ఎలాగంటే..
చర్మం అయినా, జుట్టు అయినా - సౌందర్య సంరక్షణలో కొబ్బరి నూనెకు ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటికీ అమ్మమ్మలు, నానమ్మలు చర్మానికి కొబ్బరి నూనెను వినియోగిస్తుంటారు. కొబ్బరి నూనెలో వివిధ రకాల విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది చర్మం, జుట్టు రెండింటికీ మేలు చేస్తాయి. దెబ్బతిన్న జుట్టు, చర్మాలకు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల చికిత్స అందిస్తుంది..
Updated on: Sep 02, 2024 | 7:41 PM

చర్మం అయినా, జుట్టు అయినా - సౌందర్య సంరక్షణలో కొబ్బరి నూనెకు ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటికీ అమ్మమ్మలు, నానమ్మలు చర్మానికి కొబ్బరి నూనెను వినియోగిస్తుంటారు. కొబ్బరి నూనెలో వివిధ రకాల విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది చర్మం, జుట్టు రెండింటికీ మేలు చేస్తాయి. దెబ్బతిన్న జుట్టు, చర్మాలకు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల చికిత్స అందిస్తుంది.

కొబ్బరి నూనెను జుట్టు మూలాల నుంచి పట్టించడం ద్వారా కురులకు పోషకాలు అందించేందుకు వీలుంటుంది. జుట్టుకు కొబ్బరి నూనెను రెగ్యులర్ అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు గరుకుదనం కూడా కొబ్బరి నూనెతో సులభంగా తొలగిపోతుంది.

కొబ్బరిని ప్రతిరోజూ చట్నీ, సాంబార్ వంటి వివిధ ఆహారాలలో ఉపయోగించడమే కాకుండా, పచ్చిగా తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరిలో విటమిన్ ఇ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికే కాదు సౌందర్య పోషణలోనూ బలేగా పని చేస్తుంది.

కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, వివిధ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. తద్వారా అధిక కేలరీల తీసుకోవడం నిరోధించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. అపానవాయువు, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. కొబ్బరిలోని విటమిన్లు, మినరల్స్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చర్మంపై ముడతలు, ముఖంపై మచ్చలు పోగొట్టి సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.




