Camphor for Dandruff: కొబ్బరి నూనె – కర్పూరం కలగలిపి తలకు పట్టిస్తే.. మొండి చుండ్రు వదిలిపోతుంది! కానీ ఓ షరతు
కొబ్బరి నూనెను పురాతన కాలం నుంచి జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తున్నారు మన పూర్వికులు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కూడా కొబ్బరి నూనెను వంటలలో కూడా ఉపయోగిస్తారు. కర్పూరం రోజువారీ వినియోగంలో కర్పూరం కూడా ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ రెండింటితో చుండ్రు సమస్యను సులువుగా వదిలించుకోవచ్చు. ఎలాగంటే..
Updated on: Sep 02, 2024 | 7:55 PM

కొబ్బరి నూనెను పురాతన కాలం నుంచి జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తున్నారు మన పూర్వికులు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కూడా కొబ్బరి నూనెను వంటలలో కూడా ఉపయోగిస్తారు. కర్పూరం రోజువారీ వినియోగంలో కర్పూరం కూడా ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ రెండింటితో చుండ్రు సమస్యను సులువుగా వదిలించుకోవచ్చు. ఎలాగంటే..

కర్పూరం చర్మ, సౌందర్య సంరక్షణలో చాలా ఉపయోగకరమైనది. అయితే కర్పూరం, కొబ్బరి నూనె ఈ రెండు ఎలిమెంట్స్‌ను కలగలిపి తయారు చేసే మెటీరియల్‌కి ఉన్న ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి హెయిర్ కండిషనర్లుగా పనిచేస్తాయి. కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల వెంట్రుకలకు తేమ అందుతుంది. ఈ నూనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెను తలకు పట్టించడం ద్వారా వర్షాకాలంలో తలపై ఫంగల్ సమస్యలు తక్కువగా దాడి చేస్తాయి.

కర్పూరం యాంటీ సెప్టిక్‌గా అలాగే యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది. తాపజనక సమస్యలను తొలగించడంలో కర్పూరం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ కర్పూరం చుండ్రు, ఫంగస్ సమస్యను కూడా దూరం చేస్తుంది. కర్పూరం తీసుకోవడం వల్ల జలుబు కూడా తగ్గుతుంది. ఇక ఈ కర్పూరం వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యేక పదార్ధం నెత్తిమీద రక్త ప్రసరణను సాధారణంగా ఉంచడంతోనూ సహాయపడుతుంది.

అంటే శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కర్పూరం, కొబ్బరి నూనె ప్రాముఖ్యత అపారమైనది. మీరు రెండింటినీ మిక్స్ చేస్తే, వీటి నాణ్యత మరింత పెరుగుతుంది. అయితే కర్పూరం, కొబ్బరినూనె వంటి వాటిని తలకు నేరుగా పట్టించకూడదు. అందుకు ప్రత్యేక నిబంధనలు పాటించాలి. అప్పుడే తల చర్మం చుండ్రు ఫంగస్ లేకుండా ఉంటుంది.

అరకప్పు కొబ్బరి నూనెలో 1 గ్రాము కర్పూరాన్ని బాగా కలపాలి. కర్పూరం పూర్తిగా కరగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని తలస్నానం చేసే ముందు మాత్రమే తలకు పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉంచి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు అనుసరిస్తే చండ్రు మాయం అవుతుంది.




