Telangana: సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం.. ఇకపై వారికి కూడా ఆసరా పెన్షన్..

Telangana: ఈ మేరకు కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ప్రతిపాదన చేయగా.. మంత్రులు అంగీకారం తెలిపారు. ఇంతకాలం బీడీ కార్మికులకు మాత్రమే పెన్షన్ ఇస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు తాజా నిర్ణయంతో బీడీ టేకేదార్లకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఈ విషయాన్ని వెల్లడించారు. బీడీ టేకేదార్లకు కూడా..

Telangana: సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం.. ఇకపై వారికి కూడా ఆసరా పెన్షన్..
Beedi Takedar
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 01, 2023 | 9:48 AM

Telangana: సోమవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీడీ కార్మికులకు ఇస్తున్నట్లుగానే.. బీడీ టేకేదార్లకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ప్రతిపాదన చేయగా.. మంత్రులు అంగీకారం తెలిపారు. ఇంతకాలం బీడీ కార్మికులకు మాత్రమే పెన్షన్ ఇస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు తాజా నిర్ణయంతో బీడీ టేకేదార్లకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఈ విషయాన్ని వెల్లడించారు. బీడీ టేకేదార్లకు కూడా రూ. 2016 పెన్షన్ వస్తుందని తెలిపారు మంత్రి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.

కాగా, బీడీ కార్మికులు చేసిన బీడీలను లెక్కించి, ప్యాకింగ్ చేసి, కంపెనీలకు అప్పగిస్తారు. వీరినే టేకేదారులు అంటారు. బీడీ కార్మికుల మాదిరిగానే వీరు పని చేస్తున్నందన.. వీరికి పెన్షన్ ఇవ్వడం సరైన నిర్ణయం అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల అనంతరం వీరికి కూడా పెన్షన్ అందనుంది. అయితే, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇదిలాఉంటే.. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్ అభివృద్ధి, టీఎస్ఆర్టీసీ విలీనం, మెట్రో రైలు విస్తరణ సహా అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..