AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కిరణ్ కుమార్ రెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం.. కిషన్, రేవంత్ టార్గెట్‌గా బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం..!

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనడం విజయశాంతి సహా కొంత మంది నేతలకు నచ్చలేదు. సమైక్య ఆంధ్రకు జైకొట్టిన నల్లారితో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని రాములమ్మ తన అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటించారు. టీబీజేపీ నేతల్లో కిరణ్ కుమార్ రెడ్డిపై ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. ఆయన సేవలను తెలంగాణలో వినియోగించుకునే యోచనలో..

Telangana: కిరణ్ కుమార్ రెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం.. కిషన్, రేవంత్ టార్గెట్‌గా బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం..!
Kiran Kumar Reddy
Shiva Prajapati
|

Updated on: Aug 01, 2023 | 9:36 AM

Share

హైదరాబాద్, ఆగస్టు 01: స్ట్రాటజీ పాతదే. కాకపోతే దాన్ని అమల్లో పెట్టే విధానమే కొత్తది. యస్‌..! తెలంగాణలో ఇటు రూలింగ్ పార్టీ.. అటు అపోజిషన్ పార్టీల కాలిక్యులేషన్లు సరికొత్తగా కనిపిస్తున్నాయి. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కమలం పెద్దలు సిగ్నల్స్‌ ఇస్తుంటే.. కిరణ్ కుమార్‌ రెడ్డి పేరుతో బీజేపీని టార్గెట్ చేసింది బీఆర్‌ఎస్‌. బీజేపీకి కొత్త సారధిగా వచ్చిన కిషన్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ పెద్ద కుర్చీలో ఉన్న రేవంత్‌రెడ్డినీ.. ఒకే వ్యూహంతో ఇరకాటంలో పెడుతోంది గులాబీ దండు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనడం విజయశాంతి సహా కొంత మంది నేతలకు నచ్చలేదు. సమైక్య ఆంధ్రకు జైకొట్టిన నల్లారితో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని రాములమ్మ తన అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటించారు. టీబీజేపీ నేతల్లో కిరణ్ కుమార్ రెడ్డిపై ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. ఆయన సేవలను తెలంగాణలో వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికీ ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి.

ఆయన పరిచయాలను ఉపయోగించుకుని తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌‌ను అమలు చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలకు దగ్గరగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కిరణ్ పేరుతో బీజేపీని టార్గెట్ చేసింది బీఆర్‌ఎస్‌. తెలంగాణలో ఆంధ్రా వాళ్ళ పెత్తనం.. ఇదే బీఆర్ఎస్ పోలిటికల్ పాయింట్. కిరణ్‌ కుమార్ శిష్యుడిగా కిషన్‌రెడ్డి, చంద్రబాబు శిష్యుడిగా రేవంత్‌ వ్యవహరిస్తున్నారన్నారు మంత్రి హరీష్‌రావు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ద్రోహులు అన్న మంత్రి.. తెలంగాణను శతవిధాలా అడ్డుకున్నారన్నారు.

ఇవి కూడా చదవండి

కిషన్ రెడ్డిని కిరణ్ కుమార్ శిష్యుడు అంటూ చేస్తున్న కామెంట్స్‌కు రఘునందన్ రావు కౌంటర్‌ ఇచ్చారు. ఆంధ్ర సీఎంల పేర్లతో సీఎం కేసీఆర్ మరోసారి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

సమైక్యవాదిగా పేరు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఏ మేరకు బీజేపీకి ఉపయోగపడతారనే చర్చ జరుగుతోంది. విభజన సమయంలో నల్లారి వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. తెలంగాణలో ఆయన ఎంట్రీతో రెడ్డి సామాజికవర్గం ఓట్లను సంపాదించుకోవచ్చని బీజేపీ అధినాయకత్వం అంచనా వేసి ఉండవచ్చు. కానీ రేవంత్ రెడ్డి, షర్మిల వైపు మాత్రమే తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం మొగ్గు చూపుతుందని కొందరి అభిప్రాయం. మరి ఢిల్లీ డైరెక్షన్‌లో నల్లారి ఆపరేషన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..