Telangana: ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో పెరగనున్న కరెంట్ ఛార్జీలు.. యూనిట్‌కు ఎంత పెరుగుతుందంటే..

ఏప్రిల్‌ ప్రారంభం నుంచి కరెంట్‌ బిల్లు మోత మోగనుంది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్‌ సమాయత్తం అవుతోంది. కరెంట్ బిల్లుల్లో ఫ్యూయెల్ కాస్ట్ అడ్జెస్ట్​మెంట్ (ఎఫ్‌సీఏ) పేరిట కొత్త ఛార్జీలు వడ్డించేందుకు..

Telangana: ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో పెరగనున్న కరెంట్ ఛార్జీలు.. యూనిట్‌కు ఎంత పెరుగుతుందంటే..
FCA charges
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 13, 2023 | 4:58 PM

ఏప్రిల్‌ ప్రారంభం నుంచి కరెంట్‌ బిల్లు మోత మోగనుంది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్‌ సమాయత్తం అవుతోంది. కరెంట్ బిల్లుల్లో ఇప్పటి వరకూ కడుతోన్న అడ్వాన్స్ కన్సంప్సన్ డిపాజిట్ (ఏసీడీ) ఛార్జీలతోపాటు ఫ్యూయెల్ కాస్ట్ అడ్జెస్ట్​మెంట్ (ఎఫ్‌సీఏ) పేరిట కొత్త ఛార్జీలు వడ్డించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకుగానూ ఈఆర్సీ చట్టంలో రాష్ట్ర సర్కార్ కొత్త నిబంధనను చేర్చింది. తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (టీఎస్‌ఈఆర్సీ) నిబంధనలకు మూడో సవరణ చేస్తూ కొత్త రెగ్యులేషన్‌ను ప్రభుత్వం చేర్చింది. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను తెలంగాణ సర్కార్‌ ఆదివారం (ఫిబ్రవరి 12) అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తాజా రెగ్యులేషన్ ఏప్రిల్1 నుంచి అమల్లోకి రానున్నట్లు గెజిట్‌లో వెల్లడించింది.

కొత్త రెగ్యులేషన్ ప్రకారం.. ప్రతి 3 నెలలకోసారి కరెంట్ కొనే ధర, నష్టాలకు తగ్గట్టు యూనిట్‌కు 30 పైసల చొప్పున ఎఫ్‌సీఏను వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. అంతకుమించి వసూలు చేయరాదని రెగ్యులేషన్‌లో పేర్కొంది. ఒకవేళ ఎఫ్‌సీఏ చార్జీలు తక్కువగా ఉంటే బిల్లు నుంచి ఆమొత్తాన్ని మినహాయించాలని తెల్పింది. రైతన్నల వ్యవసాయానికి ఇచ్చే ఎల్టీవీ కరెంట్‌కు మాత్రం ఎఫ్‌సీఏ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఆ చార్జీలను సర్కారు నుంచి డిస్కంలు వసూలు చేసుకోవాలని తెలిపింది. వినియోగదారులకు బిల్లు ఇచ్చేటప్పుడు ఎఫ్‌సీఏ చార్జీలను తప్పనిసరిగా మెన్షన్ చేయాలని ప్రభుత్వం తన రెగ్యులేషన్‌లో సర్కారు తెలిపింది. పరిమితికి మించి వసూలు చేయాల్సి వస్తే కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అనుమతి లేకుండా పరిమితికి మించి ఎఫ్​సీఏ చార్జీలను వసూలు చేస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చని రెగ్యులేషన్‌లో వివరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!