AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: మద్యం మత్తులో గూగుల్‌ ఆఫీస్‌కు ఫోన్‌ చేశాడు.. హైదరాబాద్‌లో అడ్డంగా బుక్కయ్యాడు.. అసలేమైందంటే..

ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ కార్యాలయంలో బాంబు ఉందంటూ వచ్చిన ఓ కాల్‌ కలకలం రేపింది. మహారాష్ట్ర పుణెలో ఉన్న గూగుల్‌ సంస్థ కార్యాలయంలో బాంబు ఉందంటూ ఆదివారం సాయంత్రం ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు.

Google: మద్యం మత్తులో గూగుల్‌ ఆఫీస్‌కు ఫోన్‌ చేశాడు.. హైదరాబాద్‌లో అడ్డంగా బుక్కయ్యాడు.. అసలేమైందంటే..
Google
Shaik Madar Saheb
|

Updated on: Feb 13, 2023 | 4:39 PM

Share

ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ కార్యాలయంలో బాంబు ఉందంటూ వచ్చిన ఓ కాల్‌ కలకలం రేపింది. మహారాష్ట్ర పుణెలో ఉన్న గూగుల్‌ సంస్థ కార్యాలయంలో బాంబు ఉందంటూ ఆదివారం సాయంత్రం ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. బెదిరింపు ఫోన్‌ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు గూగుల్ సంస్థ కార్యాలయం సహా ఆ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం, పోలీసులు అది ఫేక్‌కాల్‌గా గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్‌ నుంచి ఆ బెదిరింపు ఫోన్ వచ్చినట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

కాగా, ఆదివారం సాయంత్రం 7.54 గంటలకు ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్సులో ఉన్న గూగుల్‌ కార్యాలయానికి ఓ ఫోన్‌ కాల్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి పుణెలోని ముంధ్వా ప్రాంతంలోని గూగుల్‌ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన గూగుల్‌ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వారు పుణె పోలీసులకు సమాచారమిచ్చారు.

వెంటనే స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు అక్కడకు చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. చివరకు అది ఫేక్‌ కాల్‌గా ధ్రువీకరించిన పోలీసులు.. కాల్‌ చేసిన వ్యక్తి హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

అనంతరం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. మద్యం మత్తులోనే ఆ వ్యక్తి బెదిరింపునకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ