Discrimination: అమానుషం..! వాటర్ బాటిల్లోని నీళ్లు తాగాడని దళిత విద్యార్థిని చితకబాదిన స్కూల్ ప్రిన్సిపల్
కాలాలు మారుతున్నా.. అభివృద్ధిపథంలో దూసుకుపోతోన్నా.. కులరక్కసి మాత్రం నివురుగప్పిన నిప్పులా సమాజంలో ఇంకా తన ఉనికిని చాటుతూనే ఉంది. మంచి చెడులను విడమర్చి అజ్ఞానాంధకారాన్ని తొలగించవల్సిన సాక్షాత్తు టీచర్లే..
కాలాలు మారుతున్నా.. అభివృద్ధిపథంలో దూసుకుపోతోన్నా.. కులరక్కసి మాత్రం నివురుగప్పిన నిప్పులా సమాజంలో ఇంకా తన ఉనికిని చాటుతూనే ఉంది. మంచి చెడులను విడమర్చి అజ్ఞానాంధకారాన్ని తొలగించవల్సిన సాక్షాత్తు టీచర్లే దళిత విద్యార్ధులను కులం పేరుతో కించపరచడం, కొట్టడం వంటివి దుశ్చర్యలకు పూనుకోవడం ఈ మధ్యకాలంలో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఇటువంటి ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బాటిల్‌లో మంచినీళ్లు తాగాడనే నెపంతో స్కూల్ విద్యార్ధిని ప్రిన్సిపల్ తీవ్రంగా కొట్టాడు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామ్ అర్జ్ తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తరప్రదేశ్ బిజ్నోర్‌లోని ఓ స్కూల్‌లో ఆదివారం (ఫిబ్రవరి 12) ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. పార్టీ సమయంలో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి టేబుల్‌పై ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లు తాగాడు. దీంతో కోపోధ్రిక్తుడైన స్కూల్ ప్రిన్సిపల్ యోగేంద్ర కుమార్ అతని సోదరుడు.. కులం పేరుతో దుర్భాషలాడుతూ విద్యార్ధిని విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత విద్యార్ధి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ప్రిన్సిపల్‌తోసహా మరో ఏడుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేశాడు. విద్యార్ధి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టినట్లు ఏఎస్పీ అర్జీ మీడియాకు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.