8th Nizam: అధికారికంగా 8వ నిజాం అంత్యక్రియలు.. తీవ్ర అభ్యంతరం చెబుతున్న వీహెచ్‌పి..
హైదరాబాద్ సంస్థానానికి ఆఖరి నిజాం మనవడు ముఖరం ఝా అంత్యక్రియలకు సర్వసన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజు ప్రత్యేక విమానంలో 8వ నిజాం పార్థివ దేహాం హైదరాబాద్‌కి..
హైదరాబాద్ సంస్థానానికి ఆఖరి నిజాం మనవడు ముఖరం ఝా అంత్యక్రియలకు సర్వసన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజు ప్రత్యేక విమానంలో 8వ నిజాం పార్థివ దేహాం హైదరబాద్‌కి చేరుకోనుంది. ముఖరం ఝా కోరిక మేరకు హైదరాబాద్‌లోని మక్కా మసీదులో ఆయన సమాధిని ఉంచేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు ముఖరం ఝా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచుతారు.
మరోవైపు ఆఖరి నిజాంకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ సలహాదారు ఏకేఖాన్ నేతృత్వంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే నిజాం వారసుడి అంత్యక్రియల్లో ప్రొటోకాల్ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికారిక లాంఛనాలకు విశ్వహిందూ పరిషత్ అడ్డుచెపుతోంది. నిరంకుశత్వానికి మారుపేరులాంటి నిజాం వంశస్థుడికి అధికారలాంఛనాలతో అంత్యక్రియలు జరపడంపై విశ్వహిందూపరిషత్ మండిపడుతోంది.
నిరంకుశ రాచరిక పాలనకు చరమ గీతం పాడేందుకు తెగించి పోరాడిన తెలంగాణ ప్రజల త్యాగాలను అవమానించడమేనని తెగేసి చెపుతోంది. మహిళల బట్టలిప్పి బతుకమ్మ లాడించిన చరిత్రను కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని వీఎస్పీ నేతలు హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు వీహెచ్‌పీ నేతలు. నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చర్య వల్ల తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైందని, లేదంటే తెలంగాణను మధ్య పాకిస్తాన్ గా ఆ దేశంలో విలీనం చేసేవారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది విశ్వహిందూ పరిషత్. ఎంఐఎం ఆదేశాలు పాటిస్తోన్న బీఆర్ఎస్.. తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను కించ పరిస్తే.. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారంటూ హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..