Dil Raju: కేజీఎఫ్ దర్శకుడితో దిల్ రాజు కొత్త ప్రాజెక్ట్.. సినిమా టైటిల్ ఏంటంటే..

వారసుడు సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న దిల్ రాజు.. తాజాగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అది కూడా సెన్సెషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏తో అంటూ క్లారిటీ కూడా ఇచ్చేశారు.

Dil Raju: కేజీఎఫ్ దర్శకుడితో దిల్ రాజు కొత్త ప్రాజెక్ట్.. సినిమా టైటిల్ ఏంటంటే..
Dil Raju, Prashant Neel
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 17, 2023 | 7:20 AM

వారుసుడు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ విజయ్ దళపతి నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించింది. వారసుడు సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న దిల్ రాజు.. తాజాగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అది కూడా సెన్సెషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏తో అంటూ క్లారిటీ కూడా ఇచ్చేశారు. వారసుడు ప్రమోషన్లలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే చిత్రం టైటిల్ కూడా చెప్పుకొచ్చారు.

కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్న సినిమా టైటిల్ రావణం అని వెల్లడించారు. ఈ సినిమాలో నటించే హీరోహీరోయిన్స్ పేర్లు ఇంకా చెప్పలేదు. ఈ సినిమాను బెస్ట్ వీఎఫ్ఎక్స్‏తో రూపొందించబోతున్నట్లు స్పష్టం చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రతి ఏడాది చిత్రాలు వస్తూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా ఫ్యామిలీ చిత్రాలు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం దిల్ రాజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆర్సీ 15 నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ రాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి సలార్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ అనంతరం.. ఎన్టీఆర్ తో ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత రావణం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాలయ్య సినిమా కోసం హాట్ బ్యూటీ భారీ రెమ్యునరేషన్..
బాలయ్య సినిమా కోసం హాట్ బ్యూటీ భారీ రెమ్యునరేషన్..
శివలింగం చుట్టూ నాగసర్పం.. ఆశ్చర్యంలో భక్తజనం.. మీరూ చూసేయండి
శివలింగం చుట్టూ నాగసర్పం.. ఆశ్చర్యంలో భక్తజనం.. మీరూ చూసేయండి
సంక్రాంతి తర్వాత..సూర్యుడి అనుగ్రహం ఈ 4 రాశుల సొంతం..
సంక్రాంతి తర్వాత..సూర్యుడి అనుగ్రహం ఈ 4 రాశుల సొంతం..
చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్!
చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్!
శ్రీలీల, సాయి పల్లవి బాలీవుడ్‌ డెబ్యూ.. ఏ సినిమాలతో అంటే.?
శ్రీలీల, సాయి పల్లవి బాలీవుడ్‌ డెబ్యూ.. ఏ సినిమాలతో అంటే.?
ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇది.. వాతావరణం ఇలా ఉండనుంది
ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇది.. వాతావరణం ఇలా ఉండనుంది
టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు
టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు
ఏం మనుషులు రా మీరు.. నోరులేని కుక్కలపై ప్రతికారమా..? 40 శునకాలను
ఏం మనుషులు రా మీరు.. నోరులేని కుక్కలపై ప్రతికారమా..? 40 శునకాలను
పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందా అని చూసి అందరూ షాక్
పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందా అని చూసి అందరూ షాక్
ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో మహిళ పరార్!
ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో మహిళ పరార్!