NTR-Team India: జూ.ఎన్‌టీఆర్‌ను కలిసి సందడి చేసిన టీమ్ ఇండియా.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు..
జనవరి 18న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మొదటి వన్డే నేపథ్యంలో.. భాగ్యనగరానికి వచ్చిన టీమిండియా యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌తో కలిసి సందడి చేశారు. ఇయర్ ఎండ్ ట్రిప్ పేరిట భార్య ప్రణతితో..
జనవరి 18న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మొదటి వన్డే నేపథ్యంలో.. భాగ్యనగరానికి వచ్చిన టీమిండియా యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌తో కలిసి సందడి చేశారు. ఇయర్ ఎండ్ ట్రిప్ పేరిట భార్య ప్రణతితో అమెరికా వెళ్లిన ఎన్‌టీఆర్.. ఆర్ఆర్ఆర్ టీమ్‌తో కలిసి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న తర్వాత తిరిగి భారత్‌కు తిరిగి వచ్చాడు. ఇదే క్రమంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా రేపటి నుంచి స్వదేశంలో న్యూజిలాండ్ టీమ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఇక్కడకు వచ్చారు. జనవరి 16న హైదరాబాద్‌లో కాలు మోపిన బ్లూ టీమ్ జూనియర్ ఎన్‌టీఆర్‌తో కలిసి ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అటు క్రికెట్ అభిమానులు, ఇటు ఎన్‌టీఆర్ అభిమానులు ఈ ఫోటోలను చూసి తెగ మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఎన్‌టీఆర్ క్రేజ్ మామూలుగా లేదంటూ’ ప్రముఖ వార్తా సంస్థలు కూడా కథనాలు రాసుకోచ్చాయి. ఇక జూనియర్ ఎన్‌టీఆర్‌ను కలిసినవారిలో యుజ్వేంద్ర చాహల్, శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ సహా పలువురు టీమిండియా ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా.. అదే దూకుడును కొనసాగిస్తూ న్యూజిలాండ్ జట్టుపై కూడా పైచేయి సాధించాలని భావిస్తోంది. ఇరుజట్ల మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు తొలి వన్డే జరగనుంది.
నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలను ఇక్కడ చూడండి..
With Some Of The Indian Cricket Team Players…@tarak9999 – @yuzi_chahal – @surya_14kumar – @ShubmanGill – @ishankishan51 – @imShard ….#NTRGoesGlobal pic.twitter.com/f1FmJx1wyy
— WORLD NTR FANS (@worldNTRfans) January 17, 2023
కాగా, భారత్ టీమ్ న్యూజిలాండ్‌లో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ఇక జనవరి 18, 21, 24 తేదీలలో మూడు వన్డేలు జరగనుండగా, జనవరి 27, 29, ఫిబ్రవరి 1 తేదీలలో మూడు టీ20లు జరుగుతాయి.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికీ), విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్(వికీ), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ .
టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికీ), రుతురాజ్ గైక్వాడ్ , శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికీ), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..