IND Vs NZ: టీమిండియాతో వన్డే సిరీస్.. కివీస్ జట్టులో భారత ప్లేయర్.. రోహిత్‌సేనకు ఆ ముగ్గురే రిస్క్.!

శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసింది. మరో సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. జనవరి 18 నుంచి స్వదేశంలో భారత్, న్యూజిలాండ్‌ మధ్య 3 వన్డేల సిరీస్‌ ప్రారంభమవుతుంది.

IND Vs NZ: టీమిండియాతో వన్డే సిరీస్.. కివీస్ జట్టులో భారత ప్లేయర్.. రోహిత్‌సేనకు ఆ ముగ్గురే రిస్క్.!
Ind Vs Nz
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 17, 2023 | 12:23 PM

శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసింది. మరో సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. జనవరి 18 నుంచి స్వదేశంలో భారత్, న్యూజిలాండ్‌ మధ్య 3 వన్డేల సిరీస్‌ ప్రారంభమవుతుంది. కివీస్ కీలక ఆటగాళ్లైన కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ ఈ సిరీస్‌కు దూరం కాగా.. పాకిస్తాన్ గడ్డపై ఆ జట్టును ఓడించి.. సరాసరి భారత్ చేరుకుంది న్యూజిలాండ్ జట్టు. అనుభవం ఉన్న ఆటగాళ్లు ముగ్గురు లేకపోయినా.. న్యూజిలాండ్ బలమైన జట్టే. ఆ టీంలో యువ ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. వారంతా కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఛాన్స్ వస్తే.. అలా తుఫాన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నారు. పాకిస్థాన్‌లో న్యూజిలాండ్ పర్యటన ఇందుకు నిదర్శనం.

ఫామ్‌లో ఉన్న లాథమ్..

కేన్ విలియమ్సన్ లేకపోయినా.. అతడి స్థానంలో లాథమ్ స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొగలడు. పాకిస్థాన్‌తో జరిగిన 2 టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన టామ్ లాథమ్ భారత్‌పై జట్టుకు చక్కటి నాయకుడు కాగలడు. అప్పట్లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో లాథమ్ 145 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

కాన్వే సవాల్..

పాకిస్థాన్ టూర్‌లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేసిన డెవాన్ కాన్వే న్యూజిలాండ్‌కు అతిపెద్ద ఆయుధం. వన్డే సిరీస్‌లో మొత్తం 153 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. గతేడాది భారత్ న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లినప్పుడు, కాన్వే బ్యాట్‌తో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం కాన్వేను నిలువరించడం భారత బౌలర్ల ముందున్న అతిపెద్ద సవాల్.

సోథీ, ఫిలిప్స్ విజృంభణ..

గత ఏడాదిన్నర కాలంగా గ్లెన్ ఫిలిప్స్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. పాకిస్థాన్‌పై ఫిలిప్స్ అజేయ అర్ధసెంచరీ సాధించి మూడో వన్డేలో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ లేకపోవడంతో బౌలింగ్ విభాగాన్ని నిర్వహించే బాధ్యత ప్రస్తుతం ఇష్ సోధీపై పడింది. టీ20 ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న సోధీతో భారత్ బ్యాటర్లు జాగ్రత్త వహించాలి. పాకిస్తాన్‌పై సోథీ తొలి టెస్టులో 8 వికెట్లు, రెండో టెస్టులో 5 వికెట్లు తీశాడు. 2 వన్డేల్లో 3 ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు. బంతితో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాట్‌తో కూడా తనవంతు సహకారం అందించగలడు. కరాచీ టెస్టులో అర్ధ సెంచరీ సాధించాడు.