Trending Video: ఆనందంతో విద్యార్థుల డ్యాన్స్.. ఒక్కసారిగా ఊహించని ఇన్సిడెంట్.. చూస్తే గుండె గడగడలాడాల్సిందే..

కొంతమందికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా.. తమ ట్యాలెంట్ తో ఉర్రూతలూగిస్తుంటారు. చాలా మంది డ్యాన్స్ వచ్చినా రాకపోయినా.. అందరితో కలిసి చేస్తుంటారు. తమకు వచ్చిన స్టెప్పులనే...

Trending Video: ఆనందంతో విద్యార్థుల డ్యాన్స్.. ఒక్కసారిగా ఊహించని ఇన్సిడెంట్.. చూస్తే గుండె గడగడలాడాల్సిందే..
Students Dancing Video
Follow us

|

Updated on: Jan 17, 2023 | 7:16 AM

కొంతమందికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా.. తమ ట్యాలెంట్ తో ఉర్రూతలూగిస్తుంటారు. చాలా మంది డ్యాన్స్ వచ్చినా రాకపోయినా.. అందరితో కలిసి చేస్తుంటారు. తమకు వచ్చిన స్టెప్పులనే రిపీట్ చేస్తూ వేస్తుంటారు. డ్యాన్స్‌లో ఏబీసీడీ కూడా తెలియని వాళ్లు పెళ్లి బరాత్ లలో డ్యాన్స్‌లు చేయడం మీరు చూసే ఉంటారు. ఇతరుల డ్యాన్స్‌ని చూస్తే వారికి కూడా డ్యాన్స్‌ చేయాలని అనిపిస్తుంది. డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా నే ఉన్నాయి. నిజానికి డ్యాన్స్ ఓ ఆర్ట్.. అలా నరనరాల్లో డ్యాన్స్ నిండిపోయిన వారు అరుదుగా కనిపిస్తుంటారు. వారు స్టేజ్ ఎక్కారంటే వారు చేసే డ్యాన్స్ చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ప్రస్తుతం అలాంటి వీడయో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో కాలేజీ స్టూడెంట్స్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్లోర్ కూలిపోయింది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఎవరికైనా వణుకు పుడుతుంది. వీడియోలో, అబ్బాయిలు మరియు అమ్మాయిలు సరదాగా డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు. ఈ లోపు ఒక్కసారిగా అక్కడ నేల కుంగిపోయింది. విద్యార్థులందరూ దానిలో పడిపోయారు. ఈ సంఘటన పెరూలోని శాన్ మార్టిన్ అనే ప్రదేశంలో జరిగింది. విద్యార్థుల స్నాతకోత్సవం జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by POP O’CLOCK (@pop_o_clock)

ఈ షాకింగ్ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఇప్పటివరకు 2 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. 29 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో.. వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..