Trending Video: ‘ఇది పాట కానే కాదు.. ఏ రాగం నాకు రాదు’.. వీడియో చూడండి.. అసలు విషయం మీకే తెలుస్తుంది..

సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని ఓ నానుడి. నిజమే మరి.. మ్యూజిక్ అంటే తెలియని వారు ఈ సృష్టిలో ఎవరూ ఉండరు. పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు మన జీవితం సంగీతంతో పెనవేసుకుపోయింది. నచ్చే సంగీతాన్ని...

Follow us

|

Updated on: Jan 17, 2023 | 6:39 AM

సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని ఓ నానుడి. నిజమే మరి.. మ్యూజిక్ అంటే తెలియని వారు ఈ సృష్టిలో ఎవరూ ఉండరు. పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు మన జీవితం సంగీతంతో పెనవేసుకుపోయింది. నచ్చే సంగీతాన్ని వింటే బాధంతా తగ్గిపోయి మనసు కుదుటపడుతుంది. చాలా తక్కువ మంది మాత్రమే సంగీతంలో ప్రావీణ్యత పొందుతారు. అయితే.. సంగీతానికి సరిగ్గా సూటైన పాట కూడా ఎంతో రమ్యంగా ఉంటుంది. కొందరికి పాత పాటలంటే ఇష్టం. మరికొందరికి కొత్త, స్టైలిష్ సాంగ్స్, ఇంకొందరికి సూఫీ పాటలు అంటే ఇష్టం. అంతే కాకుండా చాలా మంది తమకు నచ్చిన పాటను ఇష్టంగా పాడుతుంటారు. అంతే కాకుండా కొందరు ఔత్సాహికులు వాటిని షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. అలాంటి వీడియోలు ఇంటర్నెట్ లో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాటలు అందంగా పాడటం అందరి వల్లా కాదు. కానీ కొందరు మాత్రం తమకు పాడాలని ఉంటే పాడేస్తుంటారు. ఎదుటి వాళ్లు ఏమనకుంటారో అని అస్సలు పట్టించుకోరు. తమకు నచ్చిన విధంగా రాగాలు తీస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ యువతి సూపర్‌ హిట్ మూవీ క్రిష్ నుంచి ‘ఆవో సునావూన్ ప్యార్ కి ఏక్ కహానీ’ పాటను పాడుతూ కనిపించింది. కానీ ఆమె దానిని చాలా పేలవంగా పాడింది. అది విన్న తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలం. ‘అమితాబ్ బచ్చన్’ కూడా ఈ పాట విని చెవులు నొప్పులు మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @schoolwalapayar

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్కూల్‌వాలాపయార్ అనే ఐడితో షేర్ అయింది. యే క్యా సన్ లియా అని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 65 వేలకు పైగా వ్యూస్, 6 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా తమ అభిప్రాయాలను ఫన్నీ కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..