Telangana: వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్వరూపం, పేర్లు మార్చుతూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాల పేర్లు మార్చుతూ జీవో విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాల పేర్లు మార్చుతూ జీవో విడుదల చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండగా, వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా పేర్లు మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం భౌగోళిక మార్పులతో జిల్లాల పేర్లు మారుస్తున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. 13 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు, 2027.89 చ.కిమీ వైశాల్యం, 9,63,975 మంది జనాభాతో వరంగల్ జిల్లాను ఏర్పాటు చేశారు. 14మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు, 1466.23 చ.కిమీ వైశాల్యం, 8,35,420 మంది జనాభాతో హన్మకొండ జిల్లా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రజల అభీష్టానికి అనుగుణంగా జిల్లాల పేరును మార్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాలనగానే రెండు జిల్లాల ప్రజలూ తరచూ కన్ఫ్యూజన్‌కు గురయ్యారు. ఏది ఏమిటో తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదువురాని వారే కాదు.. చదువుకున్న వాళ్లు సైతం పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీంతో పేర్లను మార్చాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. అదే క్రమంలో హన్మకొండ పేరు ప్రాచుర్యం లేదన్న భావన అందరిలో ఉంది. పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇదే విషయాన్ని పలుమార్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. తాజాగా పేర్లు మార్పుతో ఇరు జిల్లాల ప్రజలు ఆనందంగా ఉన్నారు.
Also Read: ‘పిల్ల జమిందార్’.. 427 గ్రామాలకు అతడి మాటే శాసనం.. ఇంట్రస్టింగ్ స్టోరీ