Jadcherla: టీచర్ కాదు పర్వర్ట్.. తన వద్ద చదువుకునే బాలికలను ట్రాప్ చేసి ఆకృత్యాలు… ఒకరిద్దరు కాదు

మార్గనిర్దేశం చేయాల్సిన మాస్టరే మార్గం తప్పాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. పిల్లలను సన్మార్గంలో...

Jadcherla: టీచర్ కాదు పర్వర్ట్.. తన వద్ద చదువుకునే బాలికలను ట్రాప్ చేసి ఆకృత్యాలు... ఒకరిద్దరు కాదు
Parvert Teacher
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 12, 2021 | 3:14 PM

మార్గనిర్దేశం చేయాల్సిన మాస్టరే మార్గం తప్పాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిపోయి దారి తప్పాడు. పవిత్రమైన వృత్తిలో ఉన్నాననే సోయి లేకుండా కీచకుడిగా మారాడు. అభంశుభం తెలియని అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఒకరు కాదు… ఇద్దరు కాదు… అనేక మంది అమాయక బాలికలపై అకృత్యాలకు తెగబడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్న రాజాపూర్ మహేష్.. తన దగ్గర చదువుకున్న పిల్లలనే కాటేశాడు. ఆన్ లైన్ క్లాసుల పేరుతో అమ్మాయిలకు దగ్గరైన మహేష్… పలువురి ఫోన్ నెంబర్లు సేకరించి ట్రాప్ చేశాడు. అలా, ఒకరికి తెలియకుండా మరొకరిని లోబర్చుకుని అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. వీడొక్కడే కాకుండా… ఆరేడు మంది స్నేహితులతో కలిసి ఈ దారుణాలకు తెగబడినట్లు చెబుతున్నారు.

ఈ ముఠా.. ఓ బాలికను ట్రాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లడంతో వీళ్ల దారుణాలు బయటపడ్డాయి. అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీచర్ మహేష్ భాగోతాల గుట్టురట్టు అయ్యింది. అమ్మాయి తండ్రి ఫిర్యాదుతో డొంకంతా కదిలింది. కేసు దర్యాప్తులో పోలీసులకే దిమ్మతిరిగే నిజాలు బయటికి వచ్చాయి. టీచర్ మహేష్ రాజు అకృత్యాల్లో ఓ పంచాయతీ సెక్రటరీ కూడా ఉన్నట్లు గుర్తించారు. మహేష్ కు ప్రాణమిత్రుడైన ఈ పంచాయతీ సెక్రటరీ కూడా బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పంచాయతీ సెక్రటరీ భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లోనే అమ్మాయిలపై అత్యాచారాలకు తెగబడినట్లు గుర్తించారు. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీ పోలీసుల అదుపులో ఉండగా… ప్రధాన నిందితుడు రాజాపూర్ మహేష్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా నిందితులను కూడా కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితుల్లో పంచాయతీ సెక్రటరీ ఉండటంతో కేసును నీరు గార్చేందుకు స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Also Read: ‘పిల్ల జమిందార్’.. 427 గ్రామాలకు అతడి మాటే శాసనం.. ఇంట్రస్టింగ్ స్టోరీ

పైత్యం అంటే ఇదే.. బైక్‌కు ట్రాక్టర్ టైర్ బిగించాడు.. ఆ తర్వాత