Viral Video: పైత్యం అంటే ఇదే.. బైక్‌కు ట్రాక్టర్ టైర్ బిగించాడు.. ఆ తర్వాత

చాలామంది తమను తాము క్రియేటివ్‌గా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారు. ఈ క్రమంలో పలు ప్రయత్నాలు చేస్తారు.  ఫలితాలు ఆశాజనకంగా..

Viral Video: పైత్యం అంటే ఇదే.. బైక్‌కు ట్రాక్టర్ టైర్ బిగించాడు.. ఆ తర్వాత
Variety Bike
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 11, 2021 | 8:20 PM

చాలామంది తమను తాము క్రియేటివ్‌గా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారు. ఈ క్రమంలో పలు ప్రయత్నాలు చేస్తారు.  ఫలితాలు ఆశాజనకంగా ఉన్నా, లేకపోయినా.. ప్రయత్నాలు మాత్రం వారికి ఆత్మ సంతృప్తిని ఇస్తాయి.  ఇంకొందరు ఉంటారు.. వారికి జనాలు అటెన్షన్ గ్రాబ్ చేస్తే చాలు. అందుకే కాస్తంత పైత్యం ఉపయోగిస్తారు. తాజాగా ఓ వ్యక్తి తన మితిమిరీన తెలివితేటలతో వార్తల్లో నిలిచాడు. ఇతగాడు ఏం చేశాడంటే.. తన బైక్‌ ముందు చక్రం తొలగించి ట్రాక్టర్ టైర్ బిగించాడు. వెనుక భాగంలో మాత్రం చిన్న టైర్ అలాగే ఉంచాడు. అయినా కూడా అతడు బైక్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు నడిపాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బైక్‌పై వెనుక ఓ వ్యక్తిని కూడా కూర్చోబెట్టాడు.

సోషల్ మీడియాలో ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు కనిపిస్తాయి. కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తుండగా, మరికొన్ని వీడియోలు మన మనసుల్ని కలచివేస్తాయి. తాజాగా ట్రెండ్ అవుతున్న ఈ వీడియో మాత్రం జనాల్ని నవ్విస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో pen.du_ అనే అకౌంట్‌తో ఈ వీడియో షేర్ చేయబడింది. దీనిని చూసిన వారు నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. నెటిజన్లు ఈ వీడియో క్లిప్‌ను ఒకరితో ఒకరు పంచుకోవడమే కాకుండా దానిపై వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. వెర్రి.. వెయ్యి రకాలు అంటే ఇదే అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.  అతను ఈ పని ఎందుకోసం చేశాడో తెలియడం లేదంటూ మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. అయితే, ఈ వీడియో ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు అనే వివరాలు మాత్రం క్లారిటీ లేదు.

వీడియో దిగువన వీక్షించండి…

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘దెయ్యం చేప’ టెర్రర్.. లబోదిబోమంటున్న మత్య్సకారులు, చేపల పెంపకందారులు

ఆ మహిళలకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్… రేపే అకౌంట్లలో నగదు జమ