AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devil fish: తెలుగు రాష్ట్రాల్లో ‘దెయ్యం చేప’ టెర్రర్.. లబోదిబోమంటున్న మత్య్సకారులు, చేపల పెంపకందారులు

చేపల వేట కొందరికి సరదా... మరికొందరికి జీవన భృతి.. చాలా మందికి చేపల పెంపకం ఆదాయ వనరు. అయితే ఎవరు ఎక్కడ గాలమేసినా...

Devil fish: తెలుగు రాష్ట్రాల్లో 'దెయ్యం చేప' టెర్రర్.. లబోదిబోమంటున్న మత్య్సకారులు, చేపల పెంపకందారులు
Devil Fish
Ram Naramaneni
|

Updated on: Aug 11, 2021 | 7:39 PM

Share

చేపల వేట కొందరికి సరదా… మరికొందరికి జీవన భృతి.. చాలా మందికి చేపల పెంపకం ఆదాయ వనరు. అయితే ఎవరు ఎక్కడ గాలమేసినా, వల విసిరినా ఇటీవల కాలంలో ఓ వింత చేప దొరుకుతుంది. తినటానికి పనికిరాని ఈ చేప ఇపుడు అతి పెద్ధ సమస్యగా మారింది. పెద్ద సవాలే విసురుతుంది. నిత్యం ఎక్కడో ఒక చోట ఇది కనిపిస్తూ హాట్ టాపిక్‌గా మారిపోతుంది. వలకు బాగా చిక్కాయని మత్స్యకారులు, చేపల పెంపకందారులు సంతోషించేలోగానే దొరికిన చేపలు ఆశను నిరుగారుస్తున్నాయి. దిగుబడి బాగుందని చేపల రైతులు సంబరపడే సరికి ఎందుకూ పనికిరాని చేపలు నిరుత్సాహపరుస్తున్నాయి. అసలు డిమాండ్ లేని ఈ చేపలు ఎక్కడివి, ఎలా వచ్చాయి. చెరువుల్లో కాలువల్లో, నదుల్లోకి ఎలా ప్రవేశించాయో తెలుసుకుందాం పదండి.

దెయ్యం చేప.. దీనికి పొలుసులుండవ్… ఒళ్లంతా నల్లటి చారలు ఉంటాయ్. వీటిని సహజంగా వాడుక భాషలో దెయ్యం చేప, విమానం చేప అంటారు. వన్స్‌ ఇది చెరువులోకి ఎంటర్‌ అయిందా..ఇక అంతే..ఈ చేప తన సంతానాన్ని తక్కువ కాలంలోనే పది రెట్లు…వంద రెట్లు పెంచేసుకుని రైతులు వేసిన మేత మొత్తాన్ని తినేస్తుంది. కేవలం మేత మాత్రమే కాదు.. ఇది మాంసాహారి కూడా. తన కంటే చిన్న వైన ఇతర చేపల్ని సైతం మింగేస్తుంది. దీంతో రైతులు లబో దిబో మంటున్నారు.  పది ఎకరాల చెరువులో దెయ్యం చేప ఒకటి ఉన్నా పట్టుబడి సమయానికి అరటన్ను చేపల్ని ఇది పునరుత్పత్తి చేయగలుగుతుందట. ఇక మేతంతా ఈ చేపలే తినేస్తాయి. ఈ రెండు ప్రధాన లక్షణాలు మాత్రమే కాదు..ఇది చాలా మొండిది. భూమి పొరల్లోకి వెళ్లి బ్రతుకుతుంది. భూమి లోపల నుంచే గట్లను తొలచుకుని మరో చెరువులోకి వచ్చేస్తుంది. అంతేకాదు.. ఒకవేళ వలలో చిక్కినా తన పదునైన పళ్లతో తప్పించుకుంటుంది. దీంతో ఈ చేపలు వేసిన మేత మొత్తాన్ని కాజేస్తూ.. చేపల పెంపకం దారులను నట్టేట ముంచుతున్నాయి.

వాస్తవానికి ఇది ఎక్వేరియం రకపు చేప. దక్షిణ అమెరికా నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయింది. ఎక్వేరియంలలో పట్టే నాచును తిని ఆ గాజు పలకలు శుభ్రంగా కనిపించటానికి పెంచేవారు. కాని దాన్ని నిర్లక్ష్యంగా ఇళ్లు ఖాళీ చేసే సమయంలో, ఒక ఊరునుంచి మరో ఊరు వెళ్లేపుడు కాలువల్లో పడేయటంతో ఇపుడు డ్రైనేజల నుంచి కాలువలకు, కాలువల నుంచి రిజర్వాయర్లు, చెరువులు, నదుల్లోకి వచ్చి చేరింది. దీన్ని మందులతో ఇతర మార్గాల్లోనూ చంపటం సాధ్యం కాదంటున్నారు అధికారులు. నిర్మూలన సాధ్యం కాని ఈ దెయ్యం చేపల వల్ల ప్రతి యేటా తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల ఆదాయాన్ని రైతులు నష్టపోతున్నారు. దీని సంతతి రెట్టింపు సంఖ్యలో పెరగటంతో ఇతర మత్స్యజాతులకు ఆహారం దొరకక అవి అంతరించిపోతున్నాయని మత్స్య రైతులు వాపోతున్నారు. డెవిల్‌ ఫిష్ నిర్మూలనకు పరిష్కారం చూపించాలని అధికారులను కోరుతున్నారు.

Also Read: ఆ మహిళలకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లలో నగదు జమ

 సీఎం జగన్ సంచలనం.. భవిష్యత్‌లో కుటుంబానికి కాకుండా ప్రతి వ్యక్తికి ‘ఆరోగ్య శ్రీ’ కార్డు