Viral News: ‘పిల్ల జమిందార్’… 427 గ్రామాలకు అతడి మాటే శాసనం.. ఇంట్రస్టింగ్ స్టోరీ
తమిళనాడులో ఓ పిల్ల జమిందార్ ఉన్నాడు. అతడి వయస్సు తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. కానీ 427 గ్రామాలకు అతనే పెద్ద. అతడు చెప్పిన...
తమిళనాడులో ఓ పిల్ల జమిందార్ ఉన్నాడు. అతడి వయస్సు తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. కానీ 427 గ్రామాలకు అతనే పెద్ద. అతడు చెప్పిన తీర్పు అక్కడ శాసనం. సుమారు 2 లక్షల 50 వేలమంది జనాభాకు అతడి మాటే శాసనం. తొమ్మిది సంవత్సరాల బాలుడుకి ఇంత పెద్ద బాధ్యత ఎలా వచ్చిందో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.
తమిళనాడులోని వెల్లూర్, తిరువణ్ణామలై, తిరుపట్టూర్ జిల్లాల్లో ఉన్న అటవీ ప్రాంతాలలో సుమారు 427 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో సుమారు రెండు లక్షల 50 వేల మందికిపైగా జనాభా నివసిస్తున్నారు. ఒక్కో గ్రామానికి ఒక ఊరి పెద్దతో పాటు ముగ్గురిని పెద్ద మనుషులుగా ఎన్నుకుంటారు. ఈ పెద్దలు చెప్పిన ఎటువంటి తీర్పునైనా గ్రామ ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ 427 గ్రామాలలో ఎవరి ఇంట్లో వివాహమైనా ఆ ఊరి పెద్దల సమక్షంలోనే జరుగుతాయి. ఈ క్రమంలో ఈ గ్రామాలన్నింటికీ పెద్దగా ఉన్న 87 సంవత్సరాలు వయసున్న చిన్నండి గతేడాది అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆయన వారసుడిని ఎంపిక చేసేందుకు ఇన్నాళ్లు మల్లగుల్లాలు పడ్డారు. తొలుత 36 గ్రామాల ప్రతినిధులు సమావేశమై.. చివరకు తమ సంప్రదాయం ప్రకారం చిన్నండి మనవడు శక్తివేల్‌ను గ్రామ పెద్దగా ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని మిగిలిన గ్రామాల ప్రజలు స్వాగతించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన చిన్నండికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరికి సంతానం కింద 21 మంది ఉన్నారు. ఈ 21 మంది మనవళ్లు, మానవరాళ్లలో చిన్నండి అంశంలో పుట్టిన రెండవ కొడుకు తనయుడు 9 ఏళ్ల శక్తివేల్‌ని ఈ గ్రామాలకు పెద్దగా ఎన్నుకున్నారు.
అన్ని గ్రామాల ప్రజలు దీనికి అంగీకరించి తమ పెద్దకి బాధ్యతలను అప్పగిస్తూ అతడికి పట్టాభిషేకం చేసారు . ఇకపై ఈ 427 గ్రామాలకు చెందిన ప్రజలు శక్తివేల్ చెప్పినవి పాటించాలని తీర్మానం చేశారు. శక్తివేల్ ప్రస్తుతం నవాలూర్ పంచాయతీ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. జావదు తెగ ప్రజలంతా పంచాయతీ వ్యవస్థను ఇప్పటికీ గౌరవిస్తారు. ఇక్కడ వెలువడిన తీర్పులను పాటిస్తారు. పట్టాభిషేకం తర్వాత శక్తివేల్ మాట్లాడుతూ తన పూర్వికులు నిర్వహించిన ఈ గొప్ప బాధ్యతని భయ భక్తులతో నిర్వహిస్తానని, తన వంశం పేరు నిలబెడతానని… ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడతానని ప్రమాణం చేశాడు.
Also Read: పైత్యం అంటే ఇదే.. బైక్‌కు ట్రాక్టర్ టైర్ బిగించాడు.. ఆ తర్వాత
తెలుగు రాష్ట్రాల్లో ‘దెయ్యం చేప’ టెర్రర్.. లబోదిబోమంటున్న మత్య్సకారులు, చేపల పెంపకందారులు
సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ
హిజ్రాపై మోజుపడ్డ యువకుడు.. మాట ముచ్చటతో దగ్గరయ్యారు.. తనను దూరం చేయడం తట్టులేక..