Basar IIIT: విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై గవర్నర్ తమిళిసై ఆవేదన.. నివేదిక ఇవ్వాలని ఆదేశం..
Telangana: బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలపై గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంపై జోక్యం చేసుకోవాలని వీసీని కోరారు గవర్నర్. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న చర్యలపై 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Telangana: బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలపై గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంపై జోక్యం చేసుకోవాలని వీసీని కోరారు గవర్నర్. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న చర్యలపై 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆత్మహత్యల్లాంటి తీవ్ర చర్యలకు పాల్పడొద్దని, సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు గర్నవర్ తమిళిసై.
ఇదిలాఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు, మూడు రోజుల్లోనే బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విపక్షాలు కూడా యూనివర్శిటీ పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..