AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తొలకరి జల్లుల కోసం రైతుల ఎదురు చూపులు.. తెలుగు ప్రజలపై వరణుడు కరుణించేదెప్పుడు..

Summer Heatwave: తెలుగు రాష్ట్రాలపై వరణుడు కరుణించేదెప్పుడు. ఈ నెలంతా ఎండలే..జాడ లేని రుతుపవనాలు..తెలుగు నేల నిప్పుల కొలిమిలా మండుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న టెంపరేచర్స్‌ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.

Weather Report: తొలకరి జల్లుల కోసం రైతుల ఎదురు చూపులు.. తెలుగు ప్రజలపై వరణుడు కరుణించేదెప్పుడు..
Summer Heatwave
Sanjay Kasula
|

Updated on: Jun 16, 2023 | 1:05 PM

Share

AP- Telangana Weather Update: తెలుగు రాష్ట్రాలపై వరణుడు కరుణించేదెప్పుడు. ఈ నెలంతా ఎండలే..జాడ లేని రుతుపవనాలు..తెలుగు నేల నిప్పుల కొలిమిలా మండుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న టెంపరేచర్స్‌ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. జూన్​ 15 దాటినా దడపుట్టిస్తున్న ఎండలు, వడగాడ్పులు.  మరో మూడు రోజులు 13 జిల్లాల్లో హీట్​ వేవ్స్​ కొనసాగుతున్నాయి. వర్షం ఎప్పుడు పడుతుందా అని ఆకాశం వైపు చూస్తున్నారు జనం. రుతుపవనాల ఎంట్రీకి బిపర్​జోయ్ తుఫాన్ ​బ్రేకులు పడినట్లేనా అని అనుమానాలు కలుగుతున్నాయి.  కదలని నైరుతి.. ‘తొలకరి పలకరింపు’ మరింత ఆలస్యం అవుతందనే అనుకుంటున్నారు. ఏపీలోనే నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు.  బిపోర్‌జోయ్ తుపానుతో నైరుతి కదలికలపై ప్రతికూల ప్రభావం.

ఈ నెల 19 తరువాతే రుతుపవనాల గమనంపై స్పష్టత రానుంది. తొలకరి పలకరింపు లేక రాష్ట్రంలో కొనసాగుతున్న గ్రీష్మతాపం . తొలకరి కోసం రైతుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. గతనెలలో కురిసిన వర్షాలతో తొలకరి సాగుకు సన్నద్ధం అవుతున్న రైతులు.. వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. కొన్నిచోట్ల విత్తనం, మరికొన్ని చోట్ల దుక్కులు దున్ని ఎదురు చూస్తున్నారు. అయితే 15 రోజులు గడిచినా తొలకరి జల్లులు జాడ కనిపించడం లేదు. మృగశిరలోనూ ఎండలు మండుతున్నాయి. వాతావరణ పరిస్థితితో తొలకరి సాగుపై రైతుల్లో ఆందోళన చెందుతున్నారు.

వరుణుడి కటాక్షం కోసం ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో కప్పలకి పెళ్లి జరిపించారు..రోహిణి కారై వెళ్లినా కూడా ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో వర్షాలు కురవడం కోసం కప్పలకు పెళ్ళి చేసినట్లుగా కొత్తపేట మండలం వాడపాలెంలో స్థానికులు తెలిపారు. పూర్వం కప్పలకి పెళ్లి చేసి ఊరంతా ఊరేగింపుగా ఉరేగిస్తే వర్షాలు కురిసేవనీ ఇదే తరహాలో వాడపాలెం కప్పలకు పెళ్ళి చేసినట్లు చెప్తున్నారు గ్రామస్తులు..అటు తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో భానుడు శాంతించాలి.. నైరుతి రుతుపవనాలు త్వరగా రావాలని వేసుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు.. కాజిపేటలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో 108 కీలోల వెన్నతో అభిషేకాలు నిర్వహించారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం