AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Mohanti: తెలంగాణ కేడర్ లోకి అభిషేక్ మొహంతి.. ప్రభుత్వం ఉత్తర్వులు

ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతి (Abhishek Mohanti) ని రాష్ట్ర కేడర్​లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం (Government) ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జీవో 583 జారీ చేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర సర్కారు నివేదించింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో...

Abhishek Mohanti: తెలంగాణ కేడర్ లోకి అభిషేక్ మొహంతి.. ప్రభుత్వం ఉత్తర్వులు
Abhishek Mahanti
Vijay Saatha
| Edited By: Ganesh Mudavath|

Updated on: Mar 15, 2022 | 7:29 PM

Share

ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతి (Abhishek Mohanti) ని రాష్ట్ర కేడర్​లోకి తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం (TS Government) ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జీవో 583 జారీ చేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర సర్కారు నివేదించింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో భాగంగా అభిషేక్ మొహంతిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు కేటాయించింది. ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ను ఆశ్రయించిన అభిషేక్ తనను తెలంగాణకు కేటాయించాలని కోరారు. వాదనలు విన్న క్యాట్ అభిషేక్ మహంతిని తెలంగాణకు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అభిషేక్ మొహంతిని విధుల నుంచి రిలీవ్ చేయాలని ఏపీని, విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణను ఆదేశించింది. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. దీంతో తెలంగాణ సీఎస్ పై అభిషేక్ మొహంతి ట్రైబ్యునల్లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

సీఎస్ తీరుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రైబ్యునల్.. ఇవాళ వ్యక్తిగతంగా హాజరుకావాలని సీఎస్ ను ఆదేశించింది. క్యాట్ విచారణ నిలిపివేయాలని సోమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు అభిషేక్ మొహంతిని ఎందుకు విధుల్లోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ క్యాట్ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని స్పష్టం చేసింది. ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ జీవో జారీ చేసినట్టు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. దీంతో ఇవాళ సోమేశ్ కుమార్ వ్యక్తిగతంగా హాజరుకావాలన్న క్యాట్ ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.

మూడు తరాల ఐపీఎస్ ఫ్యామిలీ.. 

తండ్రి ఉమ్మడి ఏపీ డీజీపీ, సోదరుడు తెలంగాణలో డీఐజీ క్యాడర్ గా పనిచేయడంతో మూడో తరం సైతం వాళ్ల ఫ్యామిలీ నుంచి ఐపీఎస్ లు వచ్చారు. అభిషేక్ తండ్రి ఏకే మహంతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గా పని చేశారు. 2009 ఎన్నికల సమయం లో అప్పటి డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ ను ఎన్నికల కమిషన్ బదిలీచేస్తే ఎలక్షన్ కమిషన్ ఏకే మహంతిని డీజీపీ గా నియమించింది. ఇక అభిషేక్ సోదరుడు(అన్నయ్య) అవినాష్ మహంతి సైతం తెలంగాణ క్యాడర్ ఆఫీసర్. తెలంగాణ లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ జాయింట్ సీపీగా పనిచేసిన అవినాష్.. ప్రస్తుతం సైబరాబాద్ జాయింట్ సీపీగా పనిచేస్తున్నారు. ఇప్పడు తెలంగాణ ప్రభుత్వం అభిషేక్ ను తీసుకోవడంతో ఇద్దరు అన్నాదమ్ములు తెలంగాణ క్యాడర్ వాళ్లు అయిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also  Read

Viral Video: పంతం నీదా.. నాదా హేయ్.. అంటూ రెచ్చిపోయిన అడవి దున్నలు.. వైరల్ అయిన వీడియో..

Delhi Capitals: ఢిల్లీతో జతకట్టిన ధోని మాజీ స్నేహితుడు.. తగ్గేదేలే ఈసారి మాదే టైటిల్ అంటోన్న ఫ్యాన్స్

Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఇందులో ఏ జంతువు దాగుందో చెబితే మీరే జీనియస్!