AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Capitals: ఢిల్లీతో జతకట్టిన ధోని మాజీ స్నేహితుడు.. తగ్గేదేలే ఈసారి మాదే టైటిల్ అంటోన్న ఫ్యాన్స్

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌ లిస్టులో మరొక దిగ్గజ ప్లేయర్‌ చేరాడు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ టైటిల్‌ను గెలుచుకున్న ఈ మాజీ క్రికెటర్.. ప్రస్తుతం ఢిల్లీతో జతకట్టాడు.

Delhi Capitals: ఢిల్లీతో జతకట్టిన ధోని మాజీ స్నేహితుడు.. తగ్గేదేలే ఈసారి మాదే టైటిల్ అంటోన్న ఫ్యాన్స్
Ipl 2022 Delhi Capitals
Venkata Chari
|

Updated on: Mar 15, 2022 | 5:34 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) టైటిల్‌ను గెలిచేందుకు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) భారీ ప్లాన్స్ వేస్తోంది. ఈమేరకు ఢిల్లీ తన సహాయ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, ఐపీఎల్ బిగ్ మ్యాచ్ విన్నర్ షేన్ వాట్సన్‌ను నియమించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇప్పటికే అజిత్ అగార్కర్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్రాంచైజీ తన కోచింగ్ టీమ్‌లో షేన్ వాట్సన్‌కు కూడా చోటు కల్పించింది. షేన్ వాట్సన్ ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో IPL టైటిల్‌ను గెలుచుకున్నాడు. షేన్ వాట్సన్(Shane Watson) రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున IPL ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో తన కెరీర్‌ను ముగించాడు. 2020లో చివరిసారిగా ఐపీఎల్ ఆడిన వాట్సన్ ఆ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

వాట్సన్ ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లలో 3874 పరుగులు చేశాడు. అతని పేరు మీద 92 వికెట్లు ఉన్నాయి. వాట్సన్ ఈ గణాంకాలు అతని అనుభవాన్ని ప్రతిబింబిస్తాయనడంలో సందేహం లేదు. అలాగే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లతో చాలా సన్నిహితంగా ఉండటం వల్ల ఆటపై వారి అవగాహన మరింత పెరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఆటగాడిని తమ కోచింగ్ స్టాఫ్‌లో చేర్చుకోవడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్ కోచ్‌లుగా అజిత్ అగార్కర్, షేన్ వాట్సన్‌లను నియమించుకుంది. బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ హోప్స్, బ్యాటింగ్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే ఉన్నారు.

ఈమేరకు ఢిల్లీ ఛాంపియన్‌గా మారే సమయం ఆసన్నమైందని షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ టైటిల్‌ను ఎన్నడూ గెలవలేదు. 2020లో ఫైనల్‌లో ఓడిపోయింది. అయితే ఇప్పుడు ఢిల్లీ కోసం నిరీక్షణ ముగియనుందని షేన్ వాట్సన్ ఆశిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా మారడం పట్ల షేన్ వాట్సన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఒక ఆటగాడిగా ఈ టోర్నీలో నాకు గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయని, ఇప్పుడు కోచింగ్ బాధ్యతను స్వీకరించానని చెప్పుకొచ్చాడు. రికీ పాంటింగ్ నాయకత్వంలో ఈ అవకాశాన్ని పొందడం ఆనందంగా ఉందని, అతను ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ కోచ్‌లలో ఒకడని తెలిపాడు. నేను అతని నుంచి చాలా నేర్చుకుంటాను. నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానంటూ పేర్కొన్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ను బలమైన జట్టుగా షేన్ వాట్సన్ అభివర్ణించాడు. ‘ఇప్పుడు ఢిల్లీ ఐపీఎల్ ఛాంపియన్‌గా మారే సమయం ఆసన్నమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతమైనది. ప్రస్తుతం వారు ఛాంపియన్‌గా మారడానికి సమయం ఆసన్నమైంది. ఆటగాళ్లకు వీలైనంత సాయం చేయాలనుకుంటున్నాను. మేం తొలి టైటిల్ గెలవగలం’ అని పేర్కొ్న్నాడు.

View this post on Instagram

A post shared by Shane Watson (@srwatson33)

Also Read: IPL 2022: ఐపీఎల్ వద్దంది.. డీపీఎల్ రమ్మంది.. విదేశీ లీగ్‌లో ఆడనున్న ఏడుగురు భారత ప్లేయర్లు..

IPL 2022: ఐపీఎల్‌లో ఇకపై ఎవరు ఆడతారో చూస్తాం.. పీసీబీ ఛీప్ షాకింగ్ కామెంట్స్.. ఫైరవుతోన్న నెటిజన్లు..