AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఐపీఎల్‌లో ఇకపై ఎవరు ఆడతారో చూస్తాం.. పీసీబీ చీఫ్ షాకింగ్ కామెంట్స్.. ఫైరవుతోన్న నెటిజన్లు..

PSL 2022: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. అంతకు ముందు పీసీబీ చీఫ్ రమీజ్ రాజా చేసిన షాకింగ్ కామెంట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అతనిపై నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు.

IPL 2022: ఐపీఎల్‌లో ఇకపై ఎవరు ఆడతారో చూస్తాం.. పీసీబీ చీఫ్ షాకింగ్ కామెంట్స్.. ఫైరవుతోన్న నెటిజన్లు..
Ipl 2022 Ramiz Raja
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 15, 2022 | 8:15 PM

Share

ఐపీఎల్‌(IPL)లో ఆటగాళ్ల భవితవ్యం రాత్రికి రాత్రే మారిపోతుంది. ఇక్కడ పేద ఆటగాడు క్షణంలో లక్షాధికారి అవుతాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు తమ ప్రతిభను కనబరచడానికి అతిపెద్ద వేదిక ఐపీఎల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఇలాంటి ఐపీఎల్‌పై పీసీబీ(PCB) చీఫ్ రమీజ్ రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌కు వ్యతిరేకంగా రమీజ్ రాజా చేసిన ప్రకటన తరువాత, అతను సోషల్ మీడియాలో జోకర్‌గా మారాడు. ఈమేరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)రూపురేఖలు మార్చుతున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్ తరహాలో పీఎస్‌ఎల్‌లోనూ వేలం ప్రక్రియను అమలు చేస్తామని, ఆపై ఐపీఎల్‌లో ఎవరు ఆడతారో చూస్తామని చెప్పుకొచ్చాడు. కరాచీ నేషనల్ స్టేడియంలో విలేకరులతో మాట్లాడిన రమీజ్ రాజా, ప్రస్తుతం పీసీఎల్ కాన్సెప్ట్‌ను మెరుగుపరచాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. దీని ప్రకారం ముసాయిదా పద్ధతికి బదులు వేలం విధానాన్ని అమలు చేస్తామంటూ ప్రకటించారు.

పీఎస్‌ఎల్‌ వేలం ప్రక్రియ అమలు చేస్తాం- రమీజ్ రాజా

ఈమేరకు ESPN Cricinfoలో రమీజ్ రాజా మాట్లాడుతూ, పాకిస్తాన్ సూపర్ లీగ్ రూపురేఖలు మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే వేలం విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాం అంటూ పేర్కొన్నాడు.

‘ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే, మనం అలాంటి ఆస్తిని నిర్మించాలి. మా వద్ద PSL, ICC నిధులు తప్ప మరేమీ లేవు. వచ్చే ఏడాది నుంచి పీఎస్‌ఎల్‌లో ఆక్షన్ మోడల్‌ను అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. వచ్చే ఏడాది నుంచి వేలం నమూనాను అమలు చేస్తాం. ఫ్రాంచైజీ యజమానులతో మాట్లాడిన తర్వాత దీనిపై చర్చిస్తాం. ఇది పూర్తిగా మనీ గేమ్. పాకిస్థాన్‌లో క్రికెట్ ఆర్థిక వ్యవస్థ పెరిగితే, మా గౌరవం కూడా పెరుగుతుంది. పీఎస్‌ఎల్‌లో వేలం నమూనాను అమలు చేస్తే, అది ఐపీఎల్ కేటగిరీ కిందకు వస్తుంది. మరి పీఎస్‌ఎల్‌ని వదిలి ఐపీఎల్‌కు ఎవరు వెళ్తారో చూస్తాం’ అని ఆయన అన్నారు.

IPL, PSL లీగ్‌లపై తరచుగా పోలికలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, చాలా మంది దిగ్గజాలు IPL ప్రపంచంలోనే అతిపెద్ద T20 లీగ్ అని పేర్కొంటున్నారు. ఈ విషయంలో PSL ఇప్పటికీ చాలా వెనుకబడి ఉందనడంలో సందేహం లేదు. వేలం ప్రక్రియను అమలు చేయడం ద్వారా రమీజ్ రాజా ఐపీఎల్‌తో సమానంగా పీఎస్‌ఎల్‌ను తీసుకురావాలని కోరుకోవడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. ఐపీఎల్‌లో ఆటగాళ్లకు ఎంతో డబ్బు వస్తుంది. అందుకే చాలామంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడాలని కోరుకుంటుంటారు.

Also Read: INDW vs ENGW: తప్పక గెలవాల్సిందే.. లేదంటే ఇంటికే.. భారత్‌తో చావోరేవో తేల్చుకోనున్న ఇంగ్లండ్..

IPL 2022: రోహిత్ సేనకు బ్యాడ్ న్యూస్.. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరం కానున్న కీలక ప్లేయర్? మార్చి 27న తొలిపోరు..