INDW vs ENGW: తప్పక గెలవాల్సిందే.. లేదంటే ఇంటికే.. భారత్‌తో చావోరేవో తేల్చుకోనున్న ఇంగ్లండ్..
Women’s World Cup 2022, India Womens vs England Womens: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు 12వ సారి తలపడనున్నాయి. అయితే, ఈసారి మాత్రం ఇంగ్లండ్ టీం చావోరేవో తేల్చుకోనుంది.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022 (ICC Women’s World Cup 2022)లో అతిపెద్ద మ్యాచ్ మార్చి 16న జరగనుంది. ఈ మ్యాచ్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కంటే పెద్దదిగా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగే పోరు కంటే కూడా ఇది మరింత బలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచులో ఓడిపోతే టోర్నీలో ఓ జట్టు ప్రపంచ కప్ నుంచి ఔటయ్యే ప్రమాదం ఉంది. భారత జట్టుకు ఇంకా అవకాశాలు ఉన్నప్పటికీ.. సెమీఫైనల్ ఆడేందుకు ఇంగ్లండ్(England) తలుపులు మూసుకుపోతాయి. ఇప్పటివరకు భారత్(Indian Team)తో పోలిస్తే టోర్నీలో ఇంగ్లండ్ ప్రయాణం చాలా పేలవంగా ఉంది. ఈ జట్టుకు విజయం ఇంకా చాలా దూరంలోనే ఉంది.
మహిళల ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనుండగా.. టోర్నీలో ఇరు జట్లకు ఇది నాలుగో మ్యాచ్. ఇంతకు ముందు ఆడిన 3 మ్యాచ్‌ల్లో భారత్ 2 గెలిచి 1 మ్యాచులో ఓడిపోయింది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లో ఓడిపోయిన ఇంగ్లండ్ ఉమెన్స్ కెప్టెన్.. రేపు భారత్‌ను ఓడించడం తప్ప మరో మార్గం లేదని చెప్పుకొచ్చింది.
ఇంగ్లండ్‌దే పైచేయి..
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2022లో ప్రదర్శన పరంగా భారత్‌దే పైచేయిగా నిలిచింది. గతేడాది టోర్నీలో ఇంగ్లండ్‌పై ఓడిపోయి ఫైనల్ చేరుకోలేకపోయింది టీమిండియా. ఇవే కాకుండా గణాంకాలలో ఇంగ్లండ్ జట్టు భారత్ కంటే ముందుంది.
ఇరు జట్లు ఇప్పటి వరకు 72 వన్డేలు ఆడగా.. అందులో భారత్ 31 మాత్రమే గెలుపొందగా, ఇంగ్లండ్ 39 మ్యాచ్‌లు గెలిచింది. న్యూజిలాండ్ గడ్డపై ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగినా.. ఇంగ్లండ్ వైపు మొగ్గు చూపుతోంది. న్యూజిలాండ్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో భారత్ 3, ఇంగ్లండ్ 4 మ్యాచ్‌లు గెలిచాయి.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు 12వ సారి తలపడనున్నాయి. ఇంతకుముందు 11 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇంగ్లండ్ 7 విజయాలు సాధించగా, భారత్ కేవలం 4 మాత్రమే గెలిచింది.
ప్లేయింగ్ XIలో ఎలాంటి మార్పు లేదు..
గణాంకాల గేమ్‌లో ఇంగ్లండ్ ముందు భారత్ విఫలమైందని స్పష్టం అవుతోంది. కానీ, క్రికెట్‌లో ప్రతి రోజు కొత్తదే. ఆ రోజు మెరుగ్గా ఆడే జట్టు మాత్రమే గెలవగలదు. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు వచ్చే అవకాశం లేదు. ఇంగ్లండ్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ అదే జరుగుతుంది.
IPL 2022: ఐపీఎల్ టీమ్స్ కు అలెర్ట్.. కొత్త నిబంధనలు ప్రకటించిన బీసీసీఐ.. పూర్తి వివరాలివే..