IPL 2022: ఐపీఎల్ టీమ్స్ కు అలెర్ట్.. కొత్త నిబంధనలు ప్రకటించిన బీసీసీఐ.. పూర్తి వివరాలివే..
మండు వేసవిలో క్రికెట్ అభిమానులను మురిపించేందుకు ఐపీఎల్-15 సీజన్ (IPL2022) ముస్తాబవుతోంది. మార్చి 26 నుంచి ముంబయి వేదికగా ఈ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది.
మండు వేసవిలో క్రికెట్ అభిమానులను మురిపించేందుకు ఐపీఎల్-15 సీజన్ (IPL2022) ముస్తాబవుతోంది. మార్చి 26 నుంచి ముంబయి వేదికగా ఈ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. ముంబై (Mumbai)లోని వాంఖడే మైదానంలో జరిగే మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. లీగ్‌లో భాగంగా మొత్తం 65 రోజుల పాటు 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ఫ్లే ఆఫ్ మ్యాచులు మినహా, లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్స్, వేదిలకను ఇప్పటికే బీసీసీఐ (BCCI) ఖరారు చేసింది. తాజాగా కొవిడ్‌తో పాటు డీఆర్‌ఎస్‌కు సంబంధించి ఐపీఎల్‌లో అమలుచేయాల్సిన కొన్ని కొత్త నిబంధనలను బీసీసీఐ ప్రకటించింది. అదేవిధంగా మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధనలను కూడా ఐపీఎల్ లో ప్రవేశపెట్టనుంది.
రెండు రివ్యూలు..
*ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఏదైనా జట్టులోని ఆటగాళ్లు కరోనా బారిన పడి మ్యాచ్ కు 12 మంది ఆటగాళ్లు అందుబాటులో లేనప్పుడు బీసీసీఐ ఆ మ్యాచును రీషెడ్యూల్ చేయవచ్చు. ఒక వేళ రీషెడ్యూల్ సాధ్యం కాకుంటే ఈ విషయాన్ని ఐపీఎల్ టెక్నికల్ టీం దృష్టికి తీసుకెళతారు. వారే మ్యాచ్ నిర్వహణ పై తుది నిర్ణయం తీసుకుంటారు.
* ఇక రెండో కొత్త నిబంధన ఏంటంటే.. ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టు రెండు రివ్యూలు కోరే అవకాశం. ఇంతకుముందు ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు ఒక్కో సమీక్ష కోరే వెసులుబాటు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని రెండుకు పెంచారు.
*మరోవైపు ఇటీవల మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (MCG) తీసుకొచ్చిన కొత్త నిబంధనను కూడా ఐపీఎల్‌లో అమలుచేయనున్నారు. ఎవరైనా బ్యాటర్ క్యాచ్ ఔటైన సందర్భాల్లో.. క్రీజులోకి వచ్చే ఆటగాడే స్ట్రైకింగ్ చేయాలన్న నిర్ణయాన్ని ఈ సీజన్‌లోనే అమలు చేయాలనుకుంటున్నారు.
*ఇక ప్లేఆఫ్స్ లేదా ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌ల్లో ఏదైనా ఫలితం తేలకుండా టైగా మారితే.. నిర్ణీత సమయంలోనే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అది కూడా కుదరని పక్షంలో లీగ్ స్టేజ్‌లో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్టునే విజేతగా ప్రకటిస్తారు.
?NEW RULES IN IPL 2022? The new batsmen will take the strike regardless of previous batsmen crossing or not unless it’s the end of the over. IPL 2022 to have two DRS for each innings. #IPL #IPL2022 pic.twitter.com/AxYMOeoq7r
— CRICKET (@cric8addictyash) March 14, 2022
?NEW RULES?
If Any Teams Fails To Find Their Playing XI Due To COVID19, The BCCI Will Attempt To Reschedule The Game Later In The IPL 2022. If Rescheduling Won’t Be Possible Then IPL Technical Team Will See The Matter. (Source- Cricbuzz) #IPL2022 #TATAIPL #INDvSL
— Cricket Countdown (@Cric8Countdown) March 14, 2022
If any teams fails to find their playing XI due to COVID19, the BCCI will attempt to reschedule the game later in the IPL 2022. If rescheduling won’t be possible then IPL Technical Team will see the matter. #IPL2022 #IPL pic.twitter.com/DaDJtKBCIq
— CRICKET (@cric8addictyash) March 14, 2022
In IPL 2022 Playoffs/Final:
If Super Over or subsequent Super Overs can’t be completed due to some reason then the team that has finished higher in the league will be declared as winner.#ipl #IPL2022 pic.twitter.com/BoU8Hz1Yo6
— CRICKET (@cric8addictyash) March 14, 2022