- Telugu News Photo Gallery Cricket photos ICC Womens ODI Team Rankings 2022: England Bowler Sophie Ecclestone No. 1 bowler smriti mandhana mithali raj set back
ICC Women’s ODI Team Rankings: సెంచరీతో ఆకట్టుకున్నా.. భారత బ్యాటర్‌కు షాకిచ్చిన ఐసీసీ.. టాప్ 10లో ఎవరున్నారంటే?
పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు దిగజారి ఏడో ర్యాంక్‌కు పడిపోయింది. మరోవైపు వెస్టిండీస్‌పై 123 పరుగులు చేసినప్పటికీ మంధాన టాప్ 10 నుంచి నిష్క్రమించింది.
Updated on: Mar 15, 2022 | 6:01 PM

పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు దిగజారి ఏడో ర్యాంక్‌కు పడిపోయింది. ఓపెనర్ స్మృతి మంధాన 11వ స్థానానికి పడిపోయింది. గత వారం రెండు స్థానాలు పడిపోయిన మిథాలీ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, వెస్టిండీస్‌పై వరుసగా కేవలం 31, 5 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా ఓపెనర్ రాచెల్ హైన్స్‌తో కలిసి ఏడో స్థానంలో నిలిచింది. మరోవైపు వెస్టిండీస్‌పై 123 పరుగులు చేసినప్పటికీ మంధాన టాప్ 10 నుంచి నిష్క్రమించింది.

ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి.. బౌలర్ల ర్యాంకింగ్‌లో రెండు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఆరో స్థానంలో కొనసాగుతోంది.

సోఫీ ఎక్లెస్టోన్, అమీ సాటర్త్‌వైట్, మరిజానే కాప్, లారా వోల్‌వార్ట్ కూడా ప్రపంచ కప్‌లో వారి అద్భుతమైన ప్రదర్శనలతో ర్యాంకింగ్స్‌లో లాభపడ్డారు. ఇంగ్లండ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవచ్చు. కానీ, సోఫీ అద్భుతమైన బౌలింగ్‌తో ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. మరోవైపు ఇంగ్లండ్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి కెరీర్‌లోనే అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన దక్షిణాఫ్రికా ప్లేయర్ కాప్ కూడా ర్యాకింగ్స్‌లో ఆకట్టుకుంది.

బ్యాటింగ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన సాటర్త్‌వైట్, దక్షిణాఫ్రికాకు చెందిన వోల్వార్ట్ లాభపడ్డారు. సటర్త్‌వైట్ ఐదు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకోగా, వోల్వార్ట్ టాప్ 10లో ఐదో స్థానంలో నిలిచింది.

న్యూజిలాండ్‌పై అజేయంగా 48 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టిన ఆష్లీ గార్డనర్ రెండు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకుంది.




