Telangana GO.111: జీవో 111 పరిధి భూములు ఇక బంగారమే.. జీవో ఎత్తివేస్తే ఎవరికి ప్రయోజనం?

111 జీవో అంటే ఏంటి? అసలు దీని వెనుక ఉన్న కథేంటి? ఎందుకు జీవో ఎత్తివేస్తున్నారు? జీవో ఎత్తివేత వల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి నష్టం. 111 వన్ జీవో... ఈపేరు విన్నప్పుడల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో అలజడి మొదలవుతుంది.

Telangana GO.111: జీవో 111 పరిధి భూములు ఇక బంగారమే.. జీవో ఎత్తివేస్తే ఎవరికి ప్రయోజనం?
Kcr On Go 111
Follow us
TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Mar 15, 2022 | 5:41 PM

Telangana GO.111: జీవో 111 అంటే ఏంటి? అసలు దీని వెనుక ఉన్న కథేంటి? ఎందుకు జీవో ఎత్తివేస్తున్నారు? జీవో ఎత్తివేత వల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి నష్టం. 111 వన్ జీవో.. ఈపేరు విన్నప్పుడల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో అలజడి మొదలవుతుంది. లక్ష 32 వేల ఎకరాల జమీన్ కహానీ ఈ త్రిబుల్ వన్ జీవో. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్దమనుషుల పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్. ఒక్కసారి జీవో ఎత్తేస్తే… అక్కడ జరిగే రియల్ ఎస్టేట్ రికార్డులు సృష్టిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1,32,000 ఎకరాల్లో విస్తరించి ఉంది GO.111. ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు త్రిబుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ పట్టణానికి నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక త్రిబుల్ వన్ GO ఎత్తి వేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. దీంతో త్రిబుల్ వన్ జీరో పరిధిలో లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్నాపెద్ద అంతా త్రిబుల్ వన్ జీవోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వెంచర్లు అక్రమ నిర్మాణాలతో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ భారీగా జరుగుతుంది. త్రిబుల్ వన్ జీవో ఎత్తివేయాలంటూ చాలామంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు జీవో ఎత్తివేసే దిశగా వస్తుందని అందరూ భావిస్తున్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఎత్తివేయాలని ఉద్దేశంతోనే ఉంది. ఈ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రంగారెడ్డి ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. హైకోర్టు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు అడగడంతో.. సీఎం కేసీఆర్ త్రిబుల్ వన్ జీవోపై సమీక్ష జరిపారు. రిపోర్టు కోర్టుకు అందించేందుకు కొంత సమయం కావాలని అడగాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా జీవో పరిధిలో మరింత ఉండేలా, జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర వాతావరణ సమతుల్యతను పెంచేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు.

త్రిబుల్ వన్ జీవోపై నిర్ణయం తీసుకోవడానికి కోర్టును కొంతసమయం అడగడం, ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పడుతుందని ప్రకటించడం త్రిబుల్ వన్ జీవో పరిధిలోని భూ యజమానులను అయోమయానికి గురి చేస్తుంది. ఇప్పటికీ ఇక్కడ వందల సంఖ్యలో ఫామ్హౌస్ లు నిర్మించారు. విల్లాలు నిర్మించారు. భారీ ఎత్తున లావాదేవీలలో జరిగిన త్రిబుల్ వన్ లో ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే టెన్షన్ నెలకొంది. ఈనేపథ్యంలో కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. 111 జీవో పరిధిలో 1,32,600 ఏకరాల భూమి ఉందని, గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవో ఇచ్చామన్నారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ జలాశయాల నీరు అవసరం లేదని, ఇంకో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్ కు నీటి కొరత ఉండదుని అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అన్న కేసీఆర్‌. ఒక నిపుణులు కమిటీ వేశారు. ఎక్స్‌పర్ట్స్ కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తాం అంటూ సీఎం ప్రకటించారు. దీంతో 111జీవో పరిధిలో ఉన్న భూములు ఇక బంగారం కానున్నాయి.

Read Also…. 

CM KCR in Assembly: చట్టసభల్లో ప్రతి అంశం విస్తృతస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందిః సీఎం కేసీఆర్

CM KCR: ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌, మెప్మా ఉద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!