CM KCR on Hijab: ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు అభ్యంతరం ఎందుకు.?.. హిజాబ్ వివాదంపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఒక్కొక్కరు ఒక్కో రకమైన దుస్తులు ధరిస్తారు. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు అభ్యంతరం ఏమిటని తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) ప్రశ్నించారు. హిజాబ్ వివాదంపై స్పందించిన ఆయన..హైదరాబాద్ లోనూ కలహాలు...
ఒక్కొక్కరు ఒక్కో రకమైన దుస్తులు ధరిస్తారు. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు అభ్యంతరం ఏమిటని తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) ప్రశ్నించారు. హిజాబ్ వివాదంపై స్పందించిన ఆయన..హైదరాబాద్ లోనూ కలహాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దేశానికి ఐటీ క్యాపిటల్ గా బెంగళూరు ఉందని, ఆ నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారని కేసీఆర్ చెప్పారు. బెంగళూరు తర్వాత హైదరాబాద్(Hyderabad) రెండో స్థానంలో ఉందన్న కేసీఅర్.. ఈ రెండు నగరాల్లో విదేశాలకు చెందిన ఎందరో తమ విధులు నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. బెంగుళూరులో హిజాబ్ పంచాయతీ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తొడుక్కునే వస్త్రాలతో ప్రభుత్వాలకు ఏం పని అని అడిగారు. మత కలహాలు పెట్టడానికే హిజాబ్ పంచాయతీ పెట్టారని విమర్శించారు. హిజాబ్(Hijab) లాంటి సమస్యలు, మత కలహాలు ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి వివాదాల వల్ల దేశ యువత భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు. బీజేపీ సంకుచిత వ్యవహారాలు చేస్తోందని అన్నారు. ఈ దేశం ఎటు పోతోందని ప్రశ్నించారు. పెడధోరణి దేశానికి మంచిది కాదని, దీనిపై దేశ, రాష్ట్ర యువత ఆలోచించాలని అన్నారు.
మరోవైపు.. కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొంది. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. ఈ మేరకు ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే నేడు బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు. నేటి నుంచి మార్చి 19 వరకు ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఉడుపిలో నేడు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
విద్యా సంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై గత నెల కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో హిజాబ్‌కు మద్దతుగా- వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. మరోవైపు హిజాబ్ వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలంటూ ఉడుపి, కుందాపుర ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. తొలుత జస్టిస్ కృష్ణ దీక్షిత్‌తో ఏర్పాటైన ఏకసభ్య ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. దీనిపై ఫిబ్రవరి 10న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించి.. పదిహేను రోజుల పాటు వాదనలు వినింది. ఇదే సమయంలో సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ఉన్నత న్యాయస్థానం.. నేడు తుది తీర్పు వెలువరించింది.
What does government have to do with what people wear? Someone may wear a shirt, another a waist coat, someone a dhoti or sherwani. But they do #HijabPolitics; people should appreciate a city for conducive environment not to find curfew, violence, 144, says #KCR @ndtv @ndtvindia pic.twitter.com/GgalFbenjQ
— Uma Sudhir (@umasudhir) March 15, 2022
Also Read
Redmi Note 11 Pro+: మార్కెట్లోకి రెడ్ మీ సరికొత్త 5జీ ఫోన్.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు..
Alia Bhatt : బర్త్ డే గిఫ్ట్ .. ‘బ్రహ్మాస్త్ర’ అలియా గ్లిమ్ప్స్ వచ్చేసింది.. అదరగొట్టిన అందాల భామ..