Redmi Note 11 Pro+: మార్కెట్లోకి రెడ్‌ మీ సరికొత్త 5జీ ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు..

Redmi Note 11 Pro+: స్మార్ట్‌ఫోన్‌ (SmartPhone) ప్రపంచంలో సరికొత్త ఒరవడిని సృష్టించిన దిగ్గజ సంస్థ రెడ్‌ మీ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. Redmi Note 11 Pro+ పేరుతో మంగళవారం ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను...

Redmi Note 11 Pro+: మార్కెట్లోకి రెడ్‌ మీ సరికొత్త 5జీ ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు..
Redmi Note 11 Pro+
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 15, 2022 | 5:15 PM

Redmi Note 11 Pro+: స్మార్ట్‌ఫోన్‌ (SmartPhone) ప్రపంచంలో సరికొత్త ఒరవడిని సృష్టించిన దిగ్గజ సంస్థ రెడ్‌ మీ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. Redmi Note 11 Pro+ పేరుతో మంగళవారం అనగా మార్చి 15వ తేదీ నుంచి ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేశారు. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌పై యూజర్లు ఎంత కాలంగానే ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Redmi Note 11 Pro+ ప్రారంభ ధర రూ. 20,999కి అందబాటులో ఉండనుంది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌ 695 6ఎన్‌ఎమ్‌ అర్కిటెక్చర్‌ ప్రాసెసర్‌ అందించారు. ఇక ఫోన్‌ వేడిగా కాకుండా లిక్విడ్‌ కూలింగ్‌ టెక్నాలజీని ప్రత్యేకంగా ఇచ్చారు. దీంతో ఫోన్‌ హీట్‌ అనే సమస్య ఉండదు. ఇక కెమెరా విషయానికొస్తే Redmi Note 11 Pro+లో 108 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. ఇందులోని హై రిజల్యూషన్‌ హెచ్‌ఎమ్‌2 ఇమేజ్‌ సెన్సార్‌, 9 ఇన్‌ 1 పిక్సెల్‌ బైనింగ్‌ టెక్నాలజీతో ఫోటోలు అద్భుతంగా వస్తాయి.

ఇక డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెడ్జ్‌ రిఫ్రేష్‌ రేట్‌ ఈ ఫోన్‌ డిస్‌ప్లే ప్రత్యేకత. అంతేకాకుండా డిస్‌ప్లే భద్రత కోసం గొరిల్లా గ్లాస్‌ 5ని ఇచ్చారు. Redmi Note 11 Pro+లో బ్యాటరీకి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 67 వాట్స్‌ టర్బో చార్జర్‌ సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో ఒకరోజుకు సరిపోయే స్టాండ్‌బై ఛార్జింగ్ వస్తుంది. ఈఫోన్‌ మూడు(మిరాజ్ బ్లూ, ఫాంటమ్ వైట్, బ్లాక్) రంగుల్లో అందుబాటులో ఉంది.

వీటన్నింటిని కంటే ముఖ్యంగా ఈ ఫోన్ 7 బ్యాండ్ అడ్వాన్స్‌డ్ గ్లోబల్ 5G సపోర్ట్‌ను అందిస్తుంది. మిగతా ఫోన్ల కంటే ఇది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. దీనితో మీరు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. ఇన్ని గొప్ప ఫీచర్లతో మార్చి 15వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. మీరూ దీనిని కొనుగోలు చేసి 5G ఫాస్ట్ ఇంటర్నెట్‌ను ఆస్వాదించండి.

Also Read: Telangana: పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

Watch Video: కోహ్లీతో సెల్ఫీ అంటే అట్లుంటది.. నలుగురిపై కేసు నమోదు.. చాలా ఖరీదైంది బ్రో అంటూ నెటిజన్ల కామెంట్లు..

Steve Waugh: చెప్పులు కుట్టే తన స్నేహితుడి చివరి కోరిక తీర్చిన ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్.. ఫోటో నెట్టింట్లో వైరల్.