Telangana: పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?
Telangana Crime News: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Laxmaiah) అన్న కొడుకు పొన్నాల భాస్కర్ (Ponnala Bhaskar) ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్(Hyderabad) లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు..
Telangana Crime News: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Laxmaiah) అన్న కొడుకు పొన్నాల భాస్కర్ (Ponnala Bhaskar) ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్(Hyderabad) లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గేలం వేసి.. మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఉద్యోగాల పేరుతో భారీగా మోసాలకు పాల్గొన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ నిరుద్యోగులకు రైల్వే ఉద్యోగాలను ఇప్పిస్తామని.. 16 మంది నుంచి దాదాపు కోటి రూపాయలను వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు జవహార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకు పొన్నాల భాస్కర్ గా పోలీసులు గుర్తించారు.
రైల్వేలో టికెట్ కలెక్టర్, కమర్షియల్ క్లర్క్ జాబ్ ఇప్పిస్తామని చెప్పడమే కాదు.. డబ్బులు ఇచ్చిన వారికి అపాయింట్ మెంట్ లెటర్స్ , ఐడి కార్డులను సైతం భాస్కర్ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. రైల్వే లో ఉద్యోగం ఆశతో.. చాలా మంది డబ్బులను అప్పు చేసి మరీ భాస్కర్ గ్యాంగ్ కు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే తమకు ఉద్యోగం రావడంలేదని భాస్కర్ గ్యాంగ్ ను తమ డబ్బులు తిరిగి ఇవ్వమని బాధితులు అడిగారు. దీంతో నిరుద్యోగులను డబ్బులు ఇస్తానని చెప్పి.. ముంబై తీసుకెళ్లిన భాస్కర్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. నిందితుల నుండి నకిలీ రైల్వే ఐడి కార్డ్, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Also Read:
LIC IPO: ఆలస్యం కానున్న ఎల్‌ఐసీ ఐపీఓ..! మార్కెట్ అస్థిరతే కారణమా..
Srikalahasti: శ్రీకాళహస్తిలో నాగపడగల కొరత.. రాహుకేతు పూజకు అంతరాయం.. భక్తులు తీవ్ర ఆగ్రహం