LIC IPO: ఆలస్యం కానున్న ఎల్‌ఐసీ ఐపీఓ..! మార్కెట్ అస్థిరతే కారణమా..
దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ఈ ఆర్థిక సంవత్సరంలో 2021-22లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది..
దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ఈ ఆర్థిక సంవత్సరంలో 2021-22లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. అందుకే ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజా పత్రాలను ఎలాంటి పత్రాలు దాఖలు చేయకపోవడంతో ఐపీఓ ఆలస్యం అవనుంది. అయితే ఎల్‌ఐసీ ఐపిఓను ప్రారంభించేందుకు మే 12 వరకు సమయం ఉంది.
ఫిబ్రవరి 13న, ప్రభుత్వం IPO కోసం ముసాయిదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ని సెబీకి దాఖలు చేసింది. దీనికి సెబీ ఆమోదం కూడా తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 31.6 కోట్ల షేర్లను వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా ఖజానాకు దాదాపు రూ. 60,000 కోట్లు వస్తాయని అంచనా. ఎల్‌ఐసీ ఐపీఓగా వస్తే ఐపీఓగా వచ్చిన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలువనుంది.
LIC IPO పరిమాణంలో 35 శాతం వరకు రిటైల్ పెట్టుబడిదారుల కోసం రిజర్వ్ చేసింది. పాలసీదారులు లేదా ఎల్‌ఐసీ ఉద్యోగులకు ఇచ్చే డిస్కౌంట్‌ను కేంద్రం ఇంకా వెల్లడించలేదు. 2022 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పాత డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యమైన 1.75 లక్షల కోట్లను 78 వేల కోట్లకు తగ్గించారు. ఇప్పటివరకు డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.13 వేల కోట్లు మాత్రమే సమీకరించిన ప్రభుత్వం.. ఎల్‌ఐసీలో తన 5 శాతం వాటాను విక్రయించనుందని విశ్వసనీయ సమాచారం.
Read Also.. India-Russia: రష్యా ఇచ్చిన ఆఫర్‌కు భారత్ ఊ అంటే.. వాహనదారులు ఫుల్ ఖుషీ! ఆ ఆఫర్ ఏమిటంటే..