House: ఇల్లు కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో చూసుకోండి..
సొంత ఇల్లు ఉండాలని చాలా మందికి ఉంటుంది. దానికి వారు పైసాపైసా కూడబెట్టి ఇల్లు కొనడమో లేదా స్థలం కొనడమో చేస్తారు. అయితే ఇల్లు లేదా స్థలం కొనే ముందు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి...
సొంత ఇల్లు ఉండాలని చాలా మందికి ఉంటుంది. దానికి వారు పైసాపైసా కూడబెట్టి ఇల్లు కొనడమో లేదా స్థలం కొనడమో చేస్తారు. అయితే ఇల్లు లేదా స్థలం కొనే ముందు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. బిల్డర్ నుంచి లేదా రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ఇల్లు కొనుగోలు చేసే ముందు పలు డాక్యుమెంట్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఆస్తిలో పెట్టుబడి పెట్టడం చాలా పెద్ద విషయం.. కాబట్టి ఈ ప్రక్రియలో ఏదైనా పొరపాటు జరిగితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆస్తి పత్రాలను పరిశీలించేటప్పుడు కొనుగోలుదారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు పరిశీలించాల్సిన ప్రధాన డాక్యుమెంట్లు ఏమిటో చూద్దాం..
1. టైటిల్ డీడ్
ఇల్లు లేదా మరేదైనా కొనుగోలు చేసే ముందు ధృవీకరించాల్సిన ముఖ్యమైన పత్రాలలో టైటిల్ డీడ్ ఒకటి. ఇది యజమాని హక్కులు, బాధ్యతల గురించి చెబుతుంది. యాజమాన్యం, విభజన, మార్పిడి, మ్యుటేషన్ మొదలైన వాటి బదిలీకి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా టైటిల్ డీడ్ ద్వారా తెలుస్తుంది. అలాగే భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేశారా లేదా.. నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నారో లేదో ధృవీకరించుకోవాలి. వీటి గురించి మీకు అర్థం కాకపోతే లాయర్ సహాయం తీసుకోండి.
2. సర్టిఫికేట్లు
ఇల్లు ఒక ప్రత్యక్ష ఆస్తి, దీనిపై స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఇంటి పన్న విధిస్తారు. కాబట్టి దానిపై ఎలాంటి బకాయిలు లేవని ధృవీకరించుకోవడం అవసరం. దీని కోసం కొనుగోలుదారుడు ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్‌ను తనిఖీ చేయాలి. మీ ఆస్తిపై ఎలాంటి ద్రవ్య, చట్టపరమైన బాధ్యత లేదని ఈ సర్టిఫికేట్ రుజువు చేస్తుంది. దీన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పొందవచ్చు. ఇక్కడ నుంచి మీరు 30 సంవత్సరాల సంబంధించి సర్టిఫికేట్లను పొందవచ్చు.
3. నిర్మాణ క్లియరెన్స్ సర్టిఫికేట్
మీరు డెవలపర్ నుంచి ఫ్లాట్, భూమి లేదా ఇల్లు వంటి ఆస్తిని కొనుగోలు చేస్తుంటే నిర్మాణ క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం. ఈ సర్టిఫికేట్ స్థానిక అధికారుల నుంచి అనుమతులు, లైసెన్సులు, అనుమతుల గురించి తెలుపుతుంది
4. లేఅవుట్ లేదా బిల్డింగ్ ప్లాన్
లేఅవుట్ ప్లాన్‌లను ప్లానింగ్ అధికారులు తప్పనిసరిగా ఆమోదించాలి. డెవలపర్లు అదనపు అంతస్తులను కట్టడం వంటివి చేస్తుంటారు. వీటన్నింటి గురించి తెలుసుకోవాలి.
5.ఆక్యుపెన్సీ సర్టిఫికేట్
మంజూరు చేసిన అనుమతులకు అనుగుణంగా భవనం నిర్మించారని ఈ పత్రం ధృవీకరిస్తుంది. ఇది తీసుకోవాలంటే డెవలపర్ తప్పనిసరిగా అవసరమైన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి ఉండాలి.
Read Also.. Stock Market: తగ్గుతోన్న క్రూడ్ ఆయిల్ ధర.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..