AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm: మీరు పేటీఎం వాడుతున్నారా.. అయితే జాగ్రత్త డేటా చైనాకు లీకవుతుందటా..!

డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం డేటా లీక్‌ చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను...

Paytm: మీరు పేటీఎం వాడుతున్నారా.. అయితే జాగ్రత్త డేటా చైనాకు లీకవుతుందటా..!
Paytm
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 14, 2022 | 8:32 PM

డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం(Paytm) డేటా లీక్‌ చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్.. చైనా(China) సంస్థలకు డేటా(Data)ను లీక్ చేసిందని వచ్చిన వార్త కథనాలు తప్పని తేల్చి చెప్పింది. అవన్నీ నిరాధారమంటూ ట్విటర్‌ వేదికగా పేర్కొంది. అయితే కొత్త కస్టమర్లను చేర్చుకోకూడదని ఆర్బీఐ పేటీఎంకి స్పష్టం చేసింది.

అయితే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు చెందిన కంపెనీ సర్వర్లు.. చైనాకు చెందిన కంపెనీలకు డేటాను షేర్‌ చేశాయని ఇటీవల ఆర్‌బీఐ జరిపిన వార్షిక తనిఖీల్లో తేలిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు సదరు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ చైనా కంపెనీలకు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో పరోక్షంగా వాటాలు కూడా ఉన్నట్లు తెలిపాయి. ఈ కారణం వల్లే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించినట్లు ఆ కథనాలు వెల్లడించాయి.

అయితే ఈ ఆరోపణలను పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖండించింది. ‘‘చైనా సంస్థలకు డేటా లీక్‌ అంటూ వస్తోన్న కథనాలు నిరాధారం. సంచలనాల కోసం ఇలాంటి కథనాలు వస్తున్నాయి. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ పూర్తిగా స్వదేశీ బ్యాంక్‌ అయినందుకు గర్విస్తున్నాం. డేటా లోకలైజేషన్‌కు పూర్తి కట్టుబడి ఉన్నామని తెలిపింది. మా బ్యాంక్‌కు సంబంధించిన డేటా మొత్తం భారత్‌లోనే ఉందని పేర్కొంది.

మరోవైపు ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో స్టాక్‌ ఎక్స్ఛేంజీ ట్రేడింగ్‌లో సోమవారం పేటీఎం షేర్లు దారుణంగా పడిపోయాయి. షేరు విలువ 13శాతానికి పైగా పడిపోయింది. దాదాపు రూ.94 తగ్గి రూ.680లకు చేరింది. 2016 ఆగస్టులో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఏర్పాటైంది. 2017 మేలో నొయిడాలో శాఖతో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఆర్‌బీఐ ఆంక్షలను పేటీఎం ఎదుర్కోవడం ఇది మూడోసారి కాగా, కొత్తఖాతాలు ప్రారంభించవద్దనడం రెండోసారి.

అయితే పేటీఎం ఐపీఓగా వచ్చిన నుంచి ఒకటి రెండు సందర్భాలను మినహాయించి ఆ స్టాక్ పడుతూనే ఉంది. డేటా లీక్ ఆరోపణలతో భారీగా పడిన స్టాక్‌ మరింత పడిపోయే ప్రమాదం ఉందని పెట్టుబడిదారులు భయపడుతున్నారు.

Read Also.. House: ఇల్లు కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో చూసుకోండి..