Samsung Galaxy A33 5G: శాంసంగ్ గెలక్సీ ఏ33 స్మార్ట్‌ఫోన్ విడుదలకు ముందు స్పెసిఫికేషన్స్ లీక్..!
Samsung Galaxy A33 5G: శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. సరికొత్త టెక్నాలజీని వాడుతూ కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇక..
Samsung Galaxy A33 5G: శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. సరికొత్త టెక్నాలజీని వాడుతూ కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇక Samsung Galaxy A33 5G మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్చి 17న లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రావడానికి దాదాపు రెండు రోజులు మిగిలి ఉన్నాయి. అయితే విడుదల చేయడానికి ముందే దీని స్పెసిఫికేషన్, పిక్చర్ రివీల్ చేయబడ్డాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.4-అంగుళాల సైజు డిస్‌ప్లే ఉంటుంది. ఇది సూపర్ అమోలెడ్ ప్యానెల్‌గా ఉంటుంది. అలాగే Samsung inhouse 1280 ప్రాసెసర్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. ఇక ముందు వైపున 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ ఇతర వివరాల లీక్‌ల సమాచారాన్ని అపోలోస్ అనే వెబ్‌సైట్ షేర్ చేసింది. వెబ్‌సైట్ తన నివేదికలో స్పెసిఫికేషన్, ధర, ఇతర వివరాలను వెల్లడించింది.
ఈ Samsung స్మార్ట్‌ఫోన్ విడుదల భారతీయ కాలమానం ప్రకారం మార్చి 17న సాయంత్రం 7:30 గంటలకు Samsung అధికారిక YouTube ఖాతాలో ప్రారంభమవుతుంది. కంపెనీ త్వరలో ఈ మొబైల్‌తో Galaxy A73, Galaxy A53ని కూడా కస్టమర్లకు పరిచయం చేయనుంది. Galaxy A33 స్మార్ట్‌ఫోన్ 5G కనెక్టివిటీతో వస్తోంది. ఇప్పటి వరకు ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లీకులు తెరపైకి వచ్చాయి. లీక్‌ల సమాచారం ప్రకారం.. ఈ Samsung ఫోన్ బ్లాక్, బ్లూ, పీచ్, వైట్ కలర్ అనే నాలుగు కలర్ వేరియంట్‌లలో వస్తుంది.
Samsung Galaxy A33 5G కంపెనీ దీనికి ఇన్ఫినిటీ యు డిస్‌ప్లే అని పేరు పెట్టింది. ఇది పూర్తి HD ప్లస్ ప్యానెల్. దీని రిజల్యూషన్ 2400×1080 పిక్సెల్స్. దీని రిఫ్రెష్ రేట్ 90Hz, ఇది స్క్రోలింగ్, గేమింగ్‌తో వస్తోంది. అయితే అధికారిక సమాచారం కోసం విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 5000 mAh లిథియం-అయాన్ బ్యాటరీని అందించినట్లు తెలుస్తోంది. అలగే 25w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
ఇవి కూడా చదవండి: