Telangana: రాష్ట్రంలో జోరుగా సాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం.. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే..
గ్రామపంచాయతీ నుండి పట్టణం దాకా అన్ని స్థాయిల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనిపిస్తోంది. 25 లక్షల మొక్కలు,29 వేల కిలోమీటర్ల రోడ్ల శుభ్రత,18 వేల కిలోమీటర్లకు పైగా డ్రైనేజీల శుద్ధి.....రికార్డు స్థాయిలో స్వచ్ఛదనం పచ్చదనం పనులు సాగుతున్నాయి. మొదటి మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో పనులు పూర్తవగా.. మరో రెండు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు లక్షల సంఖ్యలో మొక్కలు నాటారు. వేల కిలోమీటర్ల మేర డ్రైనేజీ కాలువలను, రహదారులను శుభ్రపరిచారు. మంత్రుల నుంచి సామాన్య ప్రజల దాకా, కలెక్టర్ల నుంచి పంచాయతీ కార్యదర్శులు దాకా అధికారులు, ప్రజలు ఉత్సాహంగా స్పెషల్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు. గ్రామపంచాయతీ నుండి పట్టణం దాకా అన్ని స్థాయిల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనిపిస్తోంది.
సోమవారం నాడు స్వచ్ఛదనం – పచ్చదనం ప్రారంభం అవ్వగా…బుధవారం సాయంత్రం వరకు 25.55 లక్షల మొక్కలను నాటారు. 29, 102 కిలోమీటర్ల రహదారులను శుభ్రపరిచారు. 18,599 కిలోమీటర్ల డ్రైనేజీ కారులను శుద్ధి చేశారు. 50 వేల ప్రభుత్వ స్థలాలు కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. నీళ్లు నిలవకుండా 11, 876 లోతట్టు ప్రాంతాలను గుర్తించి చదును చేశారు. మొదటి మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో పనులు పూర్తవగా.. మరో రెండు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.