Palvancha: పాల్వంచలో ఎత్తైన టవర్లను ఎలా కూల్చేశారో చూడండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్లో కూలింగ్ టవర్ల కూల్చివేశారు అధికారులు. సోమవారం ఉదయం ఇంక్లోజన్ పద్ధ తి లో తొలగింపునకు చర్య లు చేపట్టారు. కర్మాగారంలో మూడు స్టేషన్లలోని 8 టవర్లను తొలగించారు. దీంతో పాల్వంచకే తలమానికంగా కనిపించే టవర్లు కనుమరుగు కనుమరుగయ్యాయి. కర్మాగారంలోని అత్యంత ఎత్తయిన ఈ టవర్ల కూల్చివేత మినహా మిగిలిన విభాగాలను ఇప్పటికే నేలమట్టం చేసి, వాటి తుక్కును తరలించేశారు.

Palvancha: పాల్వంచలో ఎత్తైన టవర్లను ఎలా కూల్చేశారో చూడండి

|

Updated on: Aug 08, 2024 | 1:20 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్లో కూలింగ్ టవర్ల కూల్చివేశారు అధికారులు. సోమవారం ఉదయం ఇంక్లోజన్ పద్ధ తి లో తొలగింపునకు చర్య లు చేపట్టారు. కర్మాగారంలో మూడు స్టేషన్లలోని 8 టవర్లను తొలగించారు. దీంతో పాల్వంచకే తలమానికంగా కనిపించే టవర్లు కనుమరుగు కనుమరుగయ్యాయి. కర్మాగారంలోని అత్యంత ఎత్తయిన ఈ టవర్ల కూల్చివేత మినహా మిగిలిన విభాగాలను ఇప్పటికే నేలమట్టం చేసి, వాటి తుక్కును తరలించేశారు. కూలింగ్ టవర్ల కూల్చివేతకు ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో అనుమతులు పెండింగ్‌ పడ్డాయి. టవర్లతో పాటు గతంలో నేల మట్టం చేసిన పనులకు సంబంధించి జెన్కో సంస్థ టెండర్లు ఆహ్వానించగా రూ.485 కోట్లకు హెచ్ఎర్ – కమర్షియల్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. కెటిపిఎస్‌ పాత ప్లాంట్లో 100, 120 మీటర్ల ఎత్తు లో ఉండే చిమ్నీలను గత ఫిబ్రవరి లోనే నేలమట్టం చేశారు. టవర్ల కూల్చివేత పనులు పూర్తి చేయాలంటే చుట్టూ – ఎక్స్ ప్లోజర్లను పెట్టి పక్కకు పడకుండా ఇంక్లోజన్ పద్ధతిలో కుప్పకూలేలా ఏర్పాట్లు చేశారు. కూలింగ్ టవర్లు అత్యంత ఎత్తయినవిగా కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలు, కిన్నెరసానికి వెళ్లే పర్యాటకులు ఈ టవర్లను ఫొటోలు తీసుకుంటూమురిసిపోతుంటారు. 1965 – 67 సంవత్సరాల మధ్య నిర్మించిన కెటిపిఎస్‌ ఏ,బి,సి స్టేషన్లలో 60 మెగావాట్ల సామర్థ్యం గల 1, 2, 3, 4 యూనిట్లు, 120 మెగావాట్ల సామ ర్థ్యం గల 5,6,7,8 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్‌కు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 8 కూలింగ్ టవర్లు నిర్మించారు. విద్యుత్ ఉత్పిత్తి చేసే క్రమంలో నీరు, బొగ్గు మండించినప్పుడు వచ్చే వేడిని తగ్గించేందుకు కూలింగ్ టవర్లు ఉపకరిస్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ అందాన్ని చూడాలంటే వీకెండ్ వరకు వెయిట్ చెయ్యాలా

Indian Railways: ఆన్ డ్యూటీ అయినా సరే టికెట్ ఉండి తీరాల్సిందే

ఇండిగో కీలక నిర్ణయం.. దేశీయ మార్గాల్లోనూ బిజినెస్‌ క్లాస్‌

Allu Arjun: నాని పోస్ట్‌పై స్పందించిన అల్లు అర్జున్‌.. వైరల్‌గా మారిన ట్వీట్‌

TOP 9 ET News: కేరళకు ప్రభాస్‌ రూ.2 కోట్ల సాయం.. | దేవర చుట్టమల్లే సాంగ్‌కు దిమ్మతిరిగే రెస్పాన్స్ .

Follow us