ఇండిగో కీలక నిర్ణయం.. దేశీయ మార్గాల్లోనూ బిజినెస్‌ క్లాస్‌

ఇండిగో కీలక నిర్ణయం.. దేశీయ మార్గాల్లోనూ బిజినెస్‌ క్లాస్‌

Phani CH

|

Updated on: Aug 08, 2024 | 1:15 PM

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు ప్రారంభమై 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో బిజినెస్‌ క్లాస్‌ సీట్లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. నవంబరు నెల నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న బిజినెస్‌ క్లాస్‌ టికెట్లు మంగళవారం నుంచే బుకింగ్‌కు అందుబాటులోకి వస్తాయని ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ తెలిపారు.

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు ప్రారంభమై 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో బిజినెస్‌ క్లాస్‌ సీట్లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. నవంబరు నెల నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న బిజినెస్‌ క్లాస్‌ టికెట్లు మంగళవారం నుంచే బుకింగ్‌కు అందుబాటులోకి వస్తాయని ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, విస్తారా మాత్రమే దేశీయ మార్గాల్లో బిజినెస్‌ క్లాస్‌ సీట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇండిగో బ్లూచిప్‌ పేరిట కస్టమర్‌ లాయల్టీ ప్రోగ్రామ్‌ను కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం మరో ఏడు అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థ రోజూ 2,000 విమాన సర్వీసులను 120 గమ్యస్థానాలకు నడుపుతోంది. వీటిలో 33 విదేశీ నగరాలున్నాయి. దేశీయ విమానయాన సర్వీసులలో ఇండిగో మార్కెట్ వాటా 61 శాతం. జూన్‌ చివరి నాటికి ఈ కంపెనీ వద్ద 382 విమానాలున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: నాని పోస్ట్‌పై స్పందించిన అల్లు అర్జున్‌.. వైరల్‌గా మారిన ట్వీట్‌

TOP 9 ET News: కేరళకు ప్రభాస్‌ రూ.2 కోట్ల సాయం.. | దేవర చుట్టమల్లే సాంగ్‌కు దిమ్మతిరిగే రెస్పాన్స్ .

Explainer: క్రెడిట్ కార్డ్ – రెండు వైపులా పదునున్న కత్తి