ఈ అందాన్ని చూడాలంటే వీకెండ్ వరకు వెయిట్ చెయ్యాలా

ఎగువ నుంచి భారీగా వరద చేరుకుంటున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌‌ను దాటుకుని పులిచింతల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఐదు రోజుల క్రితమే శ్రీశైలం నిండుకుండలా మారింది. తాజాగా నాగార్జునసాగర్ కూడా నిండటంతో అక్కడ కూడా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జునసాగర్‌కి ప్రస్తుతం‌ 3.58 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.

ఈ అందాన్ని చూడాలంటే వీకెండ్ వరకు వెయిట్ చెయ్యాలా

|

Updated on: Aug 08, 2024 | 1:19 PM

ఎగువ నుంచి భారీగా వరద చేరుకుంటున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌‌ను దాటుకుని పులిచింతల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఐదు రోజుల క్రితమే శ్రీశైలం నిండుకుండలా మారింది. తాజాగా నాగార్జునసాగర్ కూడా నిండటంతో అక్కడ కూడా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జునసాగర్‌కి ప్రస్తుతం‌ 3.58 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 288 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో 50వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి 2లక్షల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాగర్ డ్యామ్ గేట్ల ఎత్తడంతో.. కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Indian Railways: ఆన్ డ్యూటీ అయినా సరే టికెట్ ఉండి తీరాల్సిందే

ఇండిగో కీలక నిర్ణయం.. దేశీయ మార్గాల్లోనూ బిజినెస్‌ క్లాస్‌

Allu Arjun: నాని పోస్ట్‌పై స్పందించిన అల్లు అర్జున్‌.. వైరల్‌గా మారిన ట్వీట్‌

TOP 9 ET News: కేరళకు ప్రభాస్‌ రూ.2 కోట్ల సాయం.. | దేవర చుట్టమల్లే సాంగ్‌కు దిమ్మతిరిగే రెస్పాన్స్ .

Explainer: క్రెడిట్ కార్డ్ – రెండు వైపులా పదునున్న కత్తి

Follow us