Minister Sridhar Babu: పెట్టుబడులే లక్ష్యం సీఎం రేవంత్ యూఎస్ టూర్.. కామ్‌కాస్ట్ కంపెనీతో మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు..
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ పర్యటన కొనసాగుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడుల కోసం ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా యుఎస్‌లో మెల్ పెన్నా - EVP, రిక్ రియోబోల్లి - CTO, మైక్ క్రిసాఫుల్లి-CIO సంస్థలతో కీలక ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ పర్యటన కొనసాగుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడుల కోసం ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా యుఎస్‌లో మెల్ పెన్నా – EVP, రిక్ రియోబోల్లి – CTO, మైక్ క్రిసాఫుల్లి-CIO సంస్థలతో కీలక ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. గ్లోబల్ మీడియా అండ్ టెక్నాలజీ కంపెనీ కామ్‌కాస్ట్ సీనియర్ లీడర్‌షిప్ టీమ్‌తో మంత్రి శ్రీధర్ బాబు మధ్య ఆకర్షణీయంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు పెట్టుబడులు, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. విద్యా వైద్యం తమ ప్రధానం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు మంత్రి. నాలుగో రోజు పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి పలువురు ప్రముఖులతో భేటీ అయ్యి.. పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారన్నారు. అమెరికా, కొరియా పర్యటనల్లో పెద్ద కంపెనీలతో ఒప్పందాలతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడమే లక్ష్యమన్నారు. ఐటీ, హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్, ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు వేలకోట్ల ఒప్పందాలు చేసుకోబోతున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు.
Had a very engaging discussion with a senior leadership team of global media and technology company Comcast comprising of Mel Penna – EVP, Rick Riobolli – CTO, Mike Crisafulli- CIO and others, in the US. pic.twitter.com/IAF59v1e2L
— Sridhar Babu Duddilla (@OffDSB) August 7, 2024
ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానం ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందన్నారు మంత్రి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావవంతమైన వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఈవెంట్ AI గ్లోబల్ సమ్మిట్ సెప్టెంబర్ 5-6 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకోసం ప్రచార కార్యక్రమాన్ని, వెబ్‌సైట్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా అవిష్కరించారు. హెచ్‌ఐసీసీ వేదికగా జరిగిన 2 రోజుల సదస్సు దేశ విదేశాల్లో విస్తృతంగా ప్రచారం పొందింది. సదస్సులో చర్చించాల్సిన ప్రధాన అంశాలను ఇప్పటికే ఎంపిక చేసి, వాటిపై అపార అనుభవం ఉన్న నిపుణులతో కీలక ప్రసంగాలు చేసేలా షెడ్యూలు నిర్ణయించారు. ఈ సందర్భంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, యోట్టా, ఎన్‌విడియా వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఏఐలో భాగస్వాములుగా పనిచేయనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…