బిల్లులు సకాలంలో చెల్లించినా క్రెడిట్‌ స్కోరు పెరగకపోవడానికి కారణం?

10 January 2025

Subhash

రుణ వాయిదాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తే క్రెడిట్‌ స్కోరు పెరుగుతుందని భావిస్తుంటారు. కొన్నిసార్లు బిల్లులు చెల్లించినా స్కోరు అలాగే ఉంటుంది. దీనికి ఇతర కారణాలు ఉంటాయి.

రుణ వాయిదాలు

అధిక క్రెడిట్‌ వినియోగం: మీ క్రెడిట్‌ స్కోరును నిర్ణయించడంలో క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి కీలక పాత్ర పోషిస్తుంది. చాలామంది క్రెడిట్‌ కార్డులను పరిమితి మేరకు ఉపయోగిస్తుంటారు.

క్రెడిట్‌ వినియోగం

సమయానికి బిల్లు చెల్లించినా సరే స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే క్రెడిట్‌ కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వాడకుండా ఉండటమే ఎప్పుడూ మంచిది.

బిల్లు

కొంతమంది అవసరం లేకపోయినా అదే పనిగా రుణాలకు దరఖాస్తు చేస్తుంటారు. స్కోరు తగ్గుతుంది. పర్సనల్‌ లోన్లు, క్రెడిట్‌ కార్డులను వాడటం చేసినా చేసినా స్కోరు పెరగదు.

రుణ దరఖాస్తులు

రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడల్లా, బ్యాంకు ఆ వివరాలను క్రెడిట్‌ బ్యూరోలకు చేరవేస్తుంది. కొన్నిసార్లు బ్యాంకుల వినియోగదారుల సేవా కేంద్రం పేరుతో రుణాలు తీసుకోవాలని ఫోన్లు వస్తుంటాయి. 

రుణం కోసం

మీరు మీ పాన్‌ కార్డు చెబితే  మీ క్రెడిట్‌ స్కోరును తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. అంటే, మీరు రుణానికి దరఖాస్తు చేసినట్లుగానే ఇక్కడ నమోదవుతుంది.

పాన్‌ 

కొన్నిసార్లు క్రెడిట్‌ నివేదికలో లోపాలు ఉండవచ్చు. రుణగ్రహీత ఎంత కచ్చితంగా ఉన్నా స్కోరు పెరగదు. పూర్తిగా చెల్లించిన రుణాల వివరాలు కనిపించకపోవచ్చు. కొన్ని చెల్లింపులు నమోదు కాకపోవచ్చు.

నివేదికలో లోపాలు

కొంతమంది రుణాలు తీసుకోరు. కానీ, ఇతరుల రుణానికి హామీ సంతకం చేస్తుంటారు. వారు రుణ వాయిదాలను సకాలంలో తీర్చకపోతే, అది మీ స్కోరు పెరగకుండా చూస్తుంది.

హామీ ఉండటం