OYO వెనుక ఇంత అర్ధం ఉందా.? తెలిస్తే నోరెళ్లబెడతారు

14 January 2025

Ravi Kiran

OYO అంటే తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తెలుసు. తెలియని ప్రాంతానికి వెళ్లినప్పుడు.. అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఓయో రూమ్స్‌నే 

ఇంతటి ఫేమస్ అయిన ఓయో(OYO) హోటల్‌కు.. ఆ పేరు ఎలా వచ్చిందో తెల్సా.. దాని వెనుక అర్ధం ఏంటో తెలిస్తే.. ఈ మాత్రం తెలియకుండానే అక్కడికి వెళ్తున్నారా.? అని అనుకుంటారు. 

OYO పూర్తి పేరు 'ఆన్ యువర్ ఓన్'. ఈ హోటల్స్‌కి మొదట OYO పేరు పెట్టాలని అనుకోలేదట. దీనికి మొదట ఒరావల్ అని పేరు పెట్టారు. 

ఆన్ యువర్ ఓన్ అంటే బుక్ చేసుకున్న తర్వాత కస్టమర్స్ తమ హోటల్ గదిని పూర్తిగా తమదేనని అనుకుంటారు.    

ఓయో వ్యవస్థాపకుడు, యజమాని రితేష్ అగర్వాల్. మొదట కంపెనీ పేరు ఒరావల్ అయితే 2013లో దాని పేరును OYOగా మార్చారు. 

తాజాగా ఓయో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పెళ్లికాని వారికి హోటల్ గదులు ఇవ్వబోమని ప్రకటించారు. 

ఓయో కంపెనీ ప్రకారం, పెళ్లికాని జంటలు ఇకపై హోటళ్లను అద్దెకు తీసుకోలేరు. జంటలు కచ్చితంగా తమ మ్యారేజ్ దృవీకరణ సర్టిఫికేట్‌ను చూపించాల్సి ఉంటుంది. 

అయితే ఓయో ఈ కొత్త రూల్ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తించదు. ఈ నిబంధన మీరట్‌లో మాత్రమే ప్రవేశపెట్టారు.