11 January 2025
Subhash
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ (India) 85వ స్థానంలో నిలిచింది.
గత ఏడాది 80వ స్థానంలో ఉండగా.. ఈ సారి ఐదు స్థానాలు దిగజారింది. ఈ మేరకు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్స్‌ను ఇచ్చింది.
మొత్తం 199 దేశాల్లో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం భారత పాస్‌పోర్టుతో 57 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించే వీలుంది.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఇచ్చిన డేటా ఆధారంగా ఈ ర్యాంక్‌లను ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో సింగపూర్ (Singapore) తొలి స్థానంలో నిలిచింది.
ఈ దేశ పాస్‌పోర్టు కలిగిన వారు వీసా లేకుండానే 195 దేశాలకు వెళ్లొచ్చు. సింగపూర్ తర్వాత జపాన్ రెండో స్థానంలో నిలిచింది.
ఈ దేశ పాస్‌పోర్టుతో వీసా లేకుండానే 193 దేశాలను చుట్టేయొచ్చు. ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, దక్షిణ కొరియా, స్పెయిన్ దేశాలు మూడో స్థానంలో నిలిచాయి.
ఈ దేశాల పాస్‌పోర్టుతో వీసా లేకుండా 192 దేశాలను సందర్శించొచ్చు. ఆ తర్వాత ఆస్ట్రియా (191), డెన్మార్క్ (191) దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.