ఏనుగును ఏమన్నర్రా సామీ ఇలా చేసింది..!
ఏనుగులు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయో.. ఎప్పుడు దాడి చేస్తాయో అంతుబట్టకుండా ఉంటుంది. ప్రశాంతంగా కనిపించే ఉత్సవ ఏనుగులు ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఈ క్రమంలో కేరళ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా భక్తులపై తన ప్రతాపాన్ని చూపించింది. కేరళలో నిర్వహించిన ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది.
ఉత్సవాల కోసం తీసుకొచ్చిన ఏనుగుల్లో ఒకటి జనాలపైకి దూసుకెళ్లి భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మలప్పురంలోని బీపీ అంగడి వద్ద మంగళవారం రాత్రి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఏనుగులను తీసుకొచ్చారు. ఉత్సవాలు జరుగుతుండగా.. ఉన్నట్టుండి ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. పెద్ద పెద్దగా శబ్ధాలు చేస్తూ.. జనాల్లోకి దూసుకెళ్లింది. ఓ వ్యక్తిని తొండంతో ఎత్తి పక్కకు పడేసింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ప్రస్తుతం అతడికి కొట్టకల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతు పట్టని జబ్బు.. 3 రోజుల్లో జుట్టంతా రాలి..
డంపింగ్ యార్డ్ కింద శివాలయం 500 ఏళ్లైనా చెక్కు చెదరలేదు..
బాలయ్యతో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా ??
అభిమానులకు బాలయ్య ఫోన్.. పట్టరాని సంతోషంలో ఫ్యాన్స్
Daaku Maharaaj: డాకు మహారాజ్ ఊచకోత.. బాలయ్య సినిమా రెండురోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

