అంతు పట్టని జబ్బు.. 3 రోజుల్లో జుట్టంతా రాలి..
ఏం కాలమో ఏంటో.. మాయదారి వైరస్‌లు జనాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. HMPV గురించి ఇంకా భయపడుతూ ఉండగానే..ఇప్పుడు మరో మిస్టరీ వ్యాధి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలవారిని కంగారు పెడుతోంది. పట్టుకుంటే చాలు.. కుప్పలు తెప్పలుగా జుట్టు ఊడి వచ్చేస్తుంది. హెచ్‌ఎంపీవీ భయం వెంటాడుతుండగా, మహారాష్ట్ర..షెగావ్‌లోని బుల్దానాలో, తెలియని రోగం వ్యాపించింది.
కేవలం మూడు రోజుల్లోనే తలపై జుట్టు మొత్తం ఊడిపోవడంతో..జనం ఆందోళనకు గురవుతున్నారు. షేగావ్ తాలూకాలోని బోండ్‌గావ్, కలవాడ్, హింగానా గ్రామాల్లో గుర్తు తెలియని వైరస్ వ్యాపించి జనం ఈ వ్యాధి బారిన పడుతుండడంతో.. స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, షేగావ్‌లోని చాలా గ్రామాల్లో ప్రస్తుతం ఈ మిస్టరీ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఇక్కడ చాలా మంది ఈ తెలియని వైరస్ కారణంగా తమ జుట్టును కోల్పోతున్నారు. ముందుగా తల దురద, తర్వాత వెంట్రుకలు రాలిపోవడం, మూడోరోజు జుట్టంతా ఊడిపోతూ ఉండటంతో.. పౌరులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వ్యాధి షెగావ్ సమీపంలోని అనేక గ్రామాలలో వ్యాపించింది. జుట్టు రాలడంపై మహిళలు టెన్షన్ పడుతున్నారు. దీనిపై ఇంకా అధికారులు దృష్టి సారించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది హాస్పిటల్స్‌కి క్యూ కడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డంపింగ్ యార్డ్ కింద శివాలయం 500 ఏళ్లైనా చెక్కు చెదరలేదు..
బాలయ్యతో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా ??
అభిమానులకు బాలయ్య ఫోన్.. పట్టరాని సంతోషంలో ఫ్యాన్స్
Daaku Maharaaj: డాకు మహారాజ్ ఊచకోత.. బాలయ్య సినిమా రెండురోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

