బాలాజీ ఆలయంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు.. హత్యా..? ఆత్మహత్య?

రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దైవ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన నలుగురు విగతజీవులుగా మారారు. బాలాజీ ఆలయ ఆశ్రమంలో ఈ ఘటన వెలుగు చూసింది. పారిశుధ్య కార్మికుడు గది శుభ్రం చేసేందుకు లోపలికి వెళ్లే సరికి కుటుంబసభ్యులు మృతిదేహాలుగా పడి ఉన్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాలాజీ ఆలయంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు.. హత్యా..? ఆత్మహత్య?
Mehandipur Balaji Temple Ashram
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 15, 2025 | 10:48 AM

రాజస్థాన్‌లోని కరౌలీలోని మెహందీపూర్ బాలాజీ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మెహందీపూర్ బాలాజీ టెంపుల్ సమీపంలోని రామకృష్ణ ఆశ్రమంలోని ఓ గదిలో అందరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుటుంబం మొత్తం కలిసి జనవరి 12 న దర్శనం కోసం ఇక్కడకు వచ్చారు. బుధవారం(జనవరి 15) ఉదయం వారి మృతదేహాలు గదిలో కనిపించాయి. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు.

మృతుల కుటుంబం డెహ్రాడూన్‌లో నివాసం ఉంటూ జనవరి 12న అంటే మంగళవారం కరౌలిలోని మెహందీపూర్ బాలాజీ రామకృష్ణ ఆశ్రమానికి వచ్చారు. అయితే 2 రోజుల తరువాత, మొత్తం కుటుంబ సభ్యుల మృతదేహాలు కలిసి పడి ఉన్నాయి. కుటుంబంలో ఒక కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రులు ఉన్నారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఓ పారిశుధ్య కార్మికుడి కుటుంబసభ్యుల మృతి గురించి తొలుత తెలిసింది. ఉదయం శుభ్రం చేసేందుకు గదిలోకి వెళ్లే సరికి కుటుంబసభ్యులు పడి ఉన్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ప్రాథమికంగా సామూహిక ఆత్మహత్యగా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ధర్మశాలలోని గదిలో చనిపోయిన నలుగురు వ్యక్తులు మంగళవారం సాయంత్రం మరణించారని కరౌలి ఎస్పీ బ్రజేష్ జ్యోతి ఉపాధ్యాయ్ తెలిపారు. మృతులు నలుగురూ ఒకే కుటుంబానికి చెందిన వారని ఆయన తెలిపారు. ఇందులో తండ్రి సురేంద్ర కుమార్, తల్లి కమలేష్, కుమారుడు నితిన్, కుమార్తె నీగా గుర్తించారు. కుటుంబం డెహ్రాడూన్ ప్రాంతానికి చెందిన వారని, ప్రాథమికంగా ఏమీ చెప్పలేమని ఎస్పీ అన్నారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

దీంతో పాటు పోలీసులు ఈ కేసు సామూహిక ఆత్మహత్యగా కనిపిస్తోందని, అయితే కుటుంబం ఎందుకు ఇలా చేసిందని, ఆత్మహత్యకు కారణం ఏంటని ఆరా తీస్తున్నారు. పోలీసులు అన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇప్పుడు నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం ఆధారాలు సేకరించింది. కూతురు, తండ్రి మధ్య ఏదో సమస్య ఉందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. దాని పరిష్కారం కోసం ఆ సరేంద్ర కుటుంబం బాలాజీ సందర్శించేందుకు వచ్చారని భావిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు