Salman Khan: 60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్ ఖాన్.. అసలు విషయం చెప్పిన తండ్రి
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లతో డేటింగ్ చేసిన తర్వాత కూడా సల్మాన్ ఖాన్ సింగిల్ గానే ఉంటున్నాడు. 58 ఏళ్ల వయసులోనూ పెళ్లి ఊసెత్తడం లేదు. ఈ క్రమంలోనే సల్మాన్ వివాహంపై అతని తండ్రి సలీం ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడికి ఎందుకు పెళ్లి కాకపోవడానికి అసలు కారణాలను బయట పెట్టారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రిలేషన్షిప్ స్టేటస్ ఎప్పుడూ చర్చనీయాంశమే. 58 ఏళ్ల వయసులోనూ అతను ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కొనసాగుతున్నాడు. సల్మాన్ ఖాన్ చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడన్న ప్రచారం ఉంది. కానీ ఎవరితోనూ మూడు ముళ్ల బంధం దాకా వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో సల్మాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్ సల్మాన్ వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో సలీన్ ఖాన్ సల్మాన్ పెళ్లి గురించి ఇలా మాట్లాడారు.. ‘ సల్మాన్ ఖాన్ కు పెళ్లి చేసుకునేందుకు ధైర్యం చాలడం లేదు. అతను తన తల్లి లాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నాడు. సల్మాన్‌తో ఎంతో మంది హీరోయిన్లు పనిచేశారు. అలాగే చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ వారందరిలోనూ సల్మాన్ తన తల్లిని చూడాలనుకుంటున్నాడు. కానీ అది సాధ్యం కావడం లేదు. సల్మాన్ ఎప్పుడూ అమ్మాయిలలో తన తల్లి ఇమేజ్‌ని వెతకడానికి ప్రయత్నిస్తాడు. నా కుమారుడు ఆధునిక ఆలోచనాపరుడు కాదు. మొత్తం కుటుంబాన్ని పోషించే అమ్మాయి తన భార్యగా రావాలని సల్మాన్ కోరుకుంటున్నాడు. ఈ కండీషన్స్ తెలిసి చాలామంది నా కుమారుడిని దూరం పెట్టారు. ఇక పెళ్లి చేసుకుంటే కుటుంబానికి దూరం అవుతున్నారన్న భయం కూడా నా కుమారుడిలో ఉంది. ఈ కారణాలతోనే సల్మాన్ పెళ్లి ఆలస్యమవుతోంది’ అని సలీం ఖాన్ చెప్పుకొచ్చారు.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సికందర్’. ఈ చిత్రంలో సల్మాన్‌తో పాటు కాజల్ అగర్వాల్, రష్మిక మందన, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ కూడా కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నదియావాలా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సికందర్ సినిమా షూటింగ్ లో సల్మాన్ ఖాన్..
Exclusive video from the set of #Sikandar #SalmanKhan @BeingSalmanKhan @iamRashmika @MsKajalAggarwal
— 𝐁𝐄𝐈𝐍𝐆 𝐓𝐈𝐆𝐄𝐑…🐅!!! (@Only4Salman27) November 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.