Actress: హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్.. వీడియో వైరల్
సినిమాలతో పాటు పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన ఈ అందాల తార సడెటన్ ఇలా హిజాబ్ లో దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
బాలీవుడ్ ప్రముఖ నటి అంకితా లోఖండే తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ‘పవిత్ర రిస్తా’ వంటి సూపర్ హిట్ సీరియల్‌లో పవర్‌ఫుల్ పాత్రలో నటించి మెప్పించిందీ అందాల తార. అలాగే దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలిగా ఈ ముద్దుగుమ్మకు బాగా గుర్తింపు ఉంది. అంకిత కేవలం సీరియల్స్‌లోనే కాకుండా చాలా సినిమాల్లో కూడా నటించింది. అయితే ఇప్పుడు ఈ నటి తన సినిమాలతో కాకుండా ఒక వీడియోతో వార్తల్లో నిలిచింది. అంకిత కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో అంకితను చూసిన అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. తాజాగా ఓ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది అంకిత. అయితే ఆమె హిజాబ్ లో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసి కొందరు అంకితపై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
అంకిత లోఖండే ‘బిగ్ బాస్ 17’లో పాల్గొంది. ఫైనలిస్టుగా కూడా నిలిచింది. వీటన్నిటికంటే దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలోనే ఈ బ్యూటీ పేరు బాగా వినిపించింది. అంకితా లోఖండే కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నటికి నెట్టింట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నటి తన అభిమానులతో టచ్‌లో ఉండటానికి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంది. నటి భర్త విక్కీ జైన్‌తో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అంకిత షేర్ చేసే ప్రతి పోస్ట్‌కి అభిమానులు కూడా లైక్స్, కామెంట్స్ కురిపిస్తుంటారు.
ఎయిర్ పోర్టులో హిజాబ్ తో నటి అంకిత..
View this post on Instagram
కుటుంబ సభ్యులతో అంకితా లోఖండే..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి