Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హాట్ హీరోయిన్.. స్టెప్పులేస్తే సినిమా హిట్ అంతే
ఈ బక్కపల్చని అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె ఇండస్ట్రీలో ది మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమాలకు లక్కీ మస్కట్ గా మారిపోయిందీ అందాల తార.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని, అఖిల్ అక్కినేని ఇలా తెలుగులో స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించిందీ అందాల తార. ఇందులో చాలా సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. హిందీలోనూ పలువురి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ మూవీస్ చేసి అక్కడి ఆడియెన్స్ కు చేరువైంది. అలాగనీ ఈ ముద్దుగుమ్మ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కాదు. కేవలం స్పెషల్ సాంగ్స్ తోనే తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ స్టెప్పులేస్తే చాలు సినిమా హిట్ పక్కా అంటున్నారు. ఇటీవల తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. నెట్టింట నంబర్ వన్ గా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అదే సమయంలో ఈ సాంగ్ పై విమర్శలు వచ్చాయి. స్టెప్పులు అసభ్యకరంగా ఉన్నాయన్న కామెంట్స్ వినిపించాయి. కానీ సినిమా సక్సెస్ లో ఆ ట్రోల్స్ అన్నీ కొట్టుకుపోయాయి. మరి ఈ అమ్మాయి ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు ‘దబిడి దిబిడి’ బాక్సాఫీస్ మోత మోగిస్తోన్న ఊర్వశి రౌతెలా. బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ లో ఈ బ్యూటీ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. అలాగే ఓ స్పెషల్ సాంగ్ లోనూ సందడి చేసింది.
డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లుతోంది. ఊర్వశి రౌతెలా దబిడి దిబిడి సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ హాట్ బ్యూటీకి సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా గతంలో చిరంజీవి వాల్తేరు వీరయ్య, పవన్ కల్యాణ్ బ్రో, రామ్ పోతినేని స్కంద, అఖిల్ అక్కినేని ఏజెంట్ తదితర తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది ఊర్వశి.
బాలయ్యతో ఊర్వశి రౌతెలా..
Nandamuri Balakrishna passing a compliment to Urvashi Rautela😍🔥on Camera…#DaakuMaharaajOnJan12th @UrvashiRautela @NBK_Unofficial #nandamuribalakrishna #UrvashiRautela pic.twitter.com/dLGxPiqUs0
— Urvashi Rautela ❤️ (@AsliUrvashians) January 10, 2025
ప్రస్తుతం బ్లాక్ రోజ్ అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోందీ అందాల తార. అలాగే వెల్‌కమ్ టు జంగిల్, కసూర్ 2 అనే హిందీ సినిమాలకు సైన్ చేసింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ తో రిలేషన్ రూమర్లతో తెగ వార్తల్లో నిలుస్తోందీ అందాల తార.
బాలకృష్ణతో ఊర్వశి రౌతెలా డ్యాన్స్..
Balayya’s electrifying dance with Urvashi Rautela to ‘Dabidi Dibidi’ is the highlight of the #DaakuMaharaajSuccessParty.
The celebrations just hit a whole new level! pic.twitter.com/5nkFKyyPVt
— Backchod Indian (@IndianBackchod) January 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి