- Telugu News Photo Gallery Cinema photos Manchu Manoj Celebrates Sankranthi With Mega Family Heros And Friends, See Photos
Manchu Manoj: మెగా హీరోలతో మంచు మనోజ్ సంక్రాంతి సంబరాలు.. ఫొటోస్ ఇదిగో
దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకొన్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలో భాగమయ్యారు. ఈ క్రమంలో రాక్ స్టార్ మంచు మనోజ్ మెగా హీరోలతో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాడు.
Updated on: Jan 15, 2025 | 7:32 AM

మంచు వారబ్బాయి మంచు మనోజ్ మెగా హీరోలతో కలిసి సంక్రాంతి పండగను జరుపుకొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

మనోజ్ షేర్ చేసిన ఫోటోలలో మనోజ్, అతని భార్య, కొడుకు, కూతురుతో పాటు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సీనియర్ నటుడు నరేష్ తనయుడు విజయ్ కృష్ణ తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు

మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్, విజయ్ కృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. దీంతో మనోజ్ ఈసారి సంక్రాంతి పండగను ఇలా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం మంచు మనోజ్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిచ్చారు. ఈ ఫొటోలను నెట్టింట షేర్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి కూడా తమ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు





























